ఢిల్లీలో లోకేష్ ఫుల్ బిజీ
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు.
By: Tupaki Desk | 18 Jun 2025 9:24 AM ISTమంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఏకబిగిన అనేక మంత్రి కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీలు ఉండబోతున్నాయి. ఈ నెల 18న ఢిల్లీ వెళ్ళనున్న లోకేష్ ముందుగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ తో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.
ఆ తరువాత ఆయన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో భేటీ అవుతారు. అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఆయన భేటీ అవుతారు. అలగే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ తోనూ ఆయన సమావేశం అవుతారు. ఇక రెండవ రోజు అయిన ఈ నెల 19న కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అవుతారు. ఇదే పర్యటనలో ఆయన ఢిల్లీలో ఉన్న యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో కూడా సమావేశం అవుతారు.
ఇలా చాలా బిజీ బిజీగా లోకేష్ ఢిల్లీ టూర్ ఉండబోతోంది. ఈ టూర్ లో లోకేష్ రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద కేంద్ర మంత్రులతో భేటీ అయి వారి దృష్టికి తెస్తారు అని అంటున్నారు. అలాగే కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల తరఫున రావాల్సిన నిధులు అలాగే వివిధ ప్రాజెక్టుల విషయంలోనూ లోకేష్ వారితో భేటీ ద్వారా సానుకూల ఫలితాలు రాబడతారు అని అంటున్నారు.
లోకేష్ భేటీ కాబోతున్న కేంద్ర మంత్రుల జాబితా చూస్తే నలుగురుగా ఉంది. ఈ నలుగురు కీలక శాఖలనే చూస్తున్నారు. ఇందులో లోకేష్ చూస్తున్న విద్యా శాఖ కూడా ఉంది. దాంతో కేంద్రం నుంచి ఇతోధికంగా రావాల్సిన సాయం తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏపీకి మంజూరు చేయించేందుకు లోకేష్ టూర్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
గతంలో చూస్తే చంద్రబాబు ఇలా ఢిల్లీ టూర్ పెట్టుకుని అనేకమంది మంత్రులను ఒకేసారి కలిసేవారు. ఇపుడు లోకేష్ కూడా ఆ విధంగా చేయడం ద్వారా తండ్రి బాటలో నడుస్తున్నారు. అంతే కాదు వరసగా కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ నుంచి ప్రభుత్వంలో కీలక నేతగా తనను తాను పరిచయం చేసుకోవడం మరింతగా పలుకుబడిని పెంచుకోవడం కూడా ఈ హస్తిన టూర్ లో వ్యూహం అంటున్నారు.
అంతే కాదు జాతీయ మీడియాతో కూడా లోకేష్ చిట్ చాట్ చేసే అవకాశం ఉంది. అలా జాతీయ రాజకీయ వేదిక మీద కూడా లోకేష్ మరింతగా ఫోకస్ అయ్యేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు. సరిగా నెల క్రితం లోకేష్ ఇవే తేదీలలో ఢిల్లీకి వెళ్ళారు ఆయన ఆనాడు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అప్పట్లో ఆ వార్త సంచలనం అయింది. ఇపుడు ఢిల్లీ టూర్ లో లోకేష్ ఏ రకమైన సంచలనాలకు తెర తీస్తున్నారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
