సోషల్ మీడియాలో నారా లోకేశ్ ట్రెండింగ్.. బర్త్ డే విషెస్ పోస్టుల హోరు
ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. దాదాపు అన్ని సోషల్ ప్లాట్ ఫాంల్లో నారా లోకేశ్ బర్త్ డే విషెస్ తో నిండిపోయాయి.
By: Tupaki Political Desk | 23 Jan 2026 12:40 PM ISTఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. దాదాపు అన్ని సోషల్ ప్లాట్ ఫాంల్లో నారా లోకేశ్ బర్త్ డే విషెస్ తో నిండిపోయాయి. ఈ రోజు 43వ వడిలోకి అడుగు పెడుతున్న లోకేశ్ జన్మదినాన్ని ఏపీలో అధికార కూటమి స్పెషల్ గా జరుపుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా క్షేత్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకు లోకేశ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ పలువురు నాయకులు, సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి పోస్టులు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కూడా లోకేశ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక లోకేశ్ బావ జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సారి లోకేశ్ ను విష్ చేస్తూ ఎక్స్ లో పోస్టు రాశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులు అంతా సోషల్ మీడియా ద్వారా శుభకాంక్షలు చెబుతున్నారు. లోకేశ్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతూ ఆయన భార్య బ్రాహ్మణి రాసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నిత్యం నీ పక్కన ఉండటం మాకెంతో గర్వంగా ఉందంటూ లోకేశ్ ను ఉద్దేశిస్తూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ‘‘బాధ్యతతోపాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు. మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం.. మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి’’ అన్నారు నారా బ్రాహ్మణి. ఈ ఏడాది మీకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు నారా బ్రాహ్మణి. నిత్యం మీ పక్కన నడవడం గర్వంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు నారా బ్రాహ్మణి.
లోకేష్ ను చూస్తున్నప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు నా చేతుల్లో ఆడుకున్న పిల్లాడేనా అనిపిస్తుంది. ఆ పిల్లాడే ఇప్పుడు మంత్రిగా బాగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నాన్నా లోకేష్... నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నా అన్నారు నారా భువనేశ్వరి. ఇక ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బావ నారా లోకేష్ కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోకేష్ బర్త్ డే సందర్భంగా హడావిడి చేస్తున్నారు. గత ఏడాది లోకేష్ కి బర్త్ డే విషెస్ చెప్పని.. తారక్ ఈ ఏడాది మాత్రం శుభాకాంక్షలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా లోకేశ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
“విద్య ద్వారానే సమాజంలో సార్థకమైన మార్పు సాధ్యమని, పేదరికం చదువుకు ఎప్పటికీ అడ్డంకి కాకూడదని విశ్వసిస్తూ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సహచర మంత్రులు ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పోస్టు పెట్టడం విశేషంగా చెబుతున్నారు. ‘‘మంత్రి నారా లోకేశ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు’’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు పవన్. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ తన ట్వీట్ ను ముగించారు.
