నారా బ్రాహ్మణి అసలు ఆసక్తి ఈ విధ్యపైనే.. కాకపోతే..!
అవును... బసవతరకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే గైనకాలజికల్ అంకాలజీ లైవ్ ఆపరేటివ్ వర్క్ షాప్ ను శనివారం నారా బ్రాహ్మణి ప్రారంభించారు
By: Tupaki Desk | 1 Jun 2025 3:11 PM ISTబసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (బీఐఏసీహెచ్ అంద్ ఆర్.ఐ.) ట్రస్ట్ బోర్డు సభ్యురాలి హోదాలో నారా బ్రాహ్మణి.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సరైన అవగాహన లేకపోవడంతోనే అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆసక్తిని పంచుకున్నారు.
అవును... బసవతరకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే గైనకాలజికల్ అంకాలజీ లైవ్ ఆపరేటివ్ వర్క్ షాప్ ను శనివారం నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... మహిళలు, ప్రధానంగా గ్రామీణ మహిళల ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి తరుపున చేయూత అందిస్తామని తెలిపారు.
ఇదే సమయంలో ఆసుపత్రి బోర్డులో ఉన్న ఏకైక మహిళగా.. క్యాన్సర్ తో బాధపడే మహిళల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని బ్రాహ్మణి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు ఆసక్తికరమైన విద్యపై స్పందించారు. ఇందులో భాగంగా.. తనకు వైద్యవిద్యపై ఆసక్తి ఉండేదని.. డాక్టర్ అవ్వాలనుకున్నట్లు తెలిపారు! తప్పని పరిస్థితుల్లో బిజినెస్ వైపు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు!
అయితే.. తాను వైద్యురాలిని కాలేకపోయినా బసవతారకం ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా విధులు నిర్వర్తించడం ద్వారా ఆ కోరిక తీరుతోందని ఆమె వివరించారు. ఈ సమయంలో... వైద్యులు శస్త్రచికిత్సలను చేయడంతోపాటు ఆపరేషన్ థియేటర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసి పలు విషయాలు ఆమెకు వివరించారు!
