మూడుసార్లు చూసి రివ్యూ ఇచ్చే ఏకైక మామ్!
నాని ఏ సినిమా నటించినా మామ్ తప్పక చూస్తారుట. అంతేకాదు ఆసినిమాకి రివ్యూ కూడా ఇస్తారుట.
By: Tupaki Desk | 11 May 2025 5:30 PMనేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన 'హిట్ 3' తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో పడింది. అంతకు ముందు దసరా, సరిపోదా శనివారంతో రెండు విజయాలు నమోదయ్యాయి. ప్రస్తుతం నటిస్తోన్న 'ప్యారడైజ్' పైనా భారీ అంచనాలున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దసరాని మించి హిట్ అందుకుంటారని అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు.
అయితే నాని సిస్టర్ దీప్తి గంటాని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ రిలీజ్ 'కోర్టు' కూడా తానే నిర్మాతగా వ్యవహరించారు.' హిట్ 3' కూడా సక్సెస్ అవ్వడంతో ఆమె పేరు మారు మ్రోగుతుంది. అమెరికాలో ఉన్న దీప్తి ఇక నిర్మాణంతో పాటు డైరెక్టర్ గాను బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆమె దర్శకురాలిగా ఓ సినిమా కూడా చేస్తున్నారు. కానీ తమ్ముడు నానితో మాత్రం ఎట్టి పరిస్థి తుల్లో సినిమా చేయనని ఒట్టు పెట్టుకున్నారు.
అలా సోదరి కూడా నాని అభిమానులకు బాగా రీచ్ అయ్యారు. అలాగే నాని మామ్ కూడా మంచి సినిమా ఎనలిస్ట్ అని తెలుస్తోంది. నాని ఏ సినిమా నటించినా మామ్ తప్పక చూస్తారుట. అంతేకాదు ఆసినిమాకి రివ్యూ కూడా ఇస్తారుట. అయితే ఆ సినిమా ఒక్కసారి చూసి డిసైట్ చేయరుట. మూడు సార్లు చూసిన తర్వాత ఆ సినిమాకు తన రేటింగ్ ఇస్తారుట. ఒకసారి చూసి సినిమా బాగుందని...లేదా? బాగోలేదని జడ్జ్ చేయడం మామ్ కి నచ్చదట.
ఓ మూడు సార్లు చూసిన తర్వాత అందులో ప్లస్ లు మైనస్ లు పట్టుకుని నాని ముందు ఉంచుతారుట. ఇలా తనయుడు సినిమాలు చూసి రివ్యూలు ఇచ్చే ఏకైక మామ్ ఈవిడే. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ , ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఆ హీరోల తల్లులు మాత్రం సినిమాలకు దూరంగానే కనిపిస్తుంటారు.