Begin typing your search above and press return to search.

గణేశ్ మండపం వద్ద చికెన్ బిర్యానీ వంటలు

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు ముందుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

By:  Garuda Media   |   3 Sept 2025 9:43 AM IST
గణేశ్ మండపం వద్ద చికెన్ బిర్యానీ వంటలు
X

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో కొంత మంది నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు ముందుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ వాదనకు బలం చేకూరే ఘటనలు తరచూ దర్శనమిస్తాయి. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే. అందరిలో ఒకరిలా కాకుండా.. వివాదాస్పద అంశాలకు తెర తీసేలా వ్యవహరించే కొంత మంది గణం.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనూ ఇలాంటి పంచాయితీతో హాట్ టాపిక్ గా మారారు.

వినాయకచవితి సందర్భంగా స్థానిక గాంధీ సెంటర్ లో ఈ నెల 27న వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహిసతున్నారు. భక్తులు భారీగానే హాజరవుతున్నారు. ఇదే సెంటర్ లో గణేశ్ మండపానికి దగ్గరే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహం (గణేశ్ మండపం పక్కనే) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు.. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు పంచాయితీ మొదలైంది. వర్థంతి సభలో భాగంగా భోజనాలు పెట్టారు. ఇందులో చికెన్ బిర్యానీ వడ్డించటంతో రచ్చ మొదలైంది. గణేశ్ మండపం వద్దే చికెన్ బిర్యానీని ఎలా వడ్డిస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకున్నది లేదు. చివరకు పోలీసులు వచ్చి.. భోజనాలకు పర్మిషన్ లేదని.. చికెన్ బిర్యానీ ఎలా వండుతారని ప్రశ్నించినా వినిపించుకున్నది లేదు. భోజనానికి వచ్చిన పార్టీ క్యాడర్ కు మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్సీలు స్వయంగా చికెన్ బిర్యానీని వడ్డించటం హాట్ టాపిక్ గా మారింది. ఎస్ఐ అభ్యంతరాల్ని లైట్ తీసుకున్న వైసీపీ నేతల తీరుపై అగ్రహం వ్యక్తం చేసిన సీఐ.. తన సిబ్బందితో ఎంట్రీ ఇచ్చి వాటర్ క్యాన్లు.. ఇతర సామాగ్రిని స్టేషన్ కు తరలించారు.