Begin typing your search above and press return to search.

కీలక సమయంలో బాలయ్యను తొక్కేయాలన్న ఆరాటం ...?

అన్న గారి బ్లడ్ అయిన బాలయ్య విషయంలో ఇలా వివక్ష చూపించడం వల్ల టీడీపీకే నష్టం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 2:45 AM GMT
కీలక సమయంలో బాలయ్యను తొక్కేయాలన్న ఆరాటం ...?
X

నందమూరి కుటుంబీకులలో అత్యంత ప్రముఖుడు బాలక్రిష్ణ. వందకు పైగా సినిమాల్లో నటించి ఈ రోజుకీ సీనియర్లలో టాప్ ఫోర్ లో ముందున్న వారు. మరఒ వైపు రాజకీయాల్లో సైతం హిందూపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్ గా కీలక పాత్ర వహిస్తున్నారు. అన్నిటికీ మించి అన్నగారికి అసలైన వారసుడు. చంద్రబాబుకు బావమరిది కం వియ్యంకుడు. లోకేష్ కి స్వయాన మామ. ఇంతలా టీడీపీ అధినాయకత్వానికి సన్నిహితుడైన బాలయ్య విషయంలో టీడీపీ అనుకూల మీడియాలో ఒక పత్రిక దూరం పాటిస్తోంది అని ప్రచారం సాగిస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్న టైం లో బాలయ్య అలెర్ట్ అయి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో చర్చలు జరిపారు. మరో వైపు చూస్తే చంద్రబాబుని జైలులో పవన్ కళ్యాణ్, లోకేష్ లతో కలసి ములాఖత్ అయ్యారు. ఇలా బాలయ్య గడచిన వారంలో చాలా సీరియస్ గా పొలిటికల్ తెర మీద కనిపిస్తున్నారు.

అయితే ఆయన మీడియా మీట్ ని కానీ ఆయన ఫోటోలను కానీ టీడీపీకి చంద్రబాబుకు అత్యంత అనుకూలమైన పత్రిక కవరేజ్ అసలు ఇవ్వకుండా పక్కన పెడుతోందిట. ఈ విషయం మీదనే ఇపుడు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సదరు పత్రికా యజమానితో బాలయ్యకు గొడవలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరి మధ్యన ఒక వివాదం నడచిందని నాటి నుంచి బాలయ్యను ఆ పత్రిక పక్కన పెడుతోంది అంటున్నారు.

అయితే టీడీపీకి ఇపుడున్న కష్టకాలంలో అలా చేయడం తగునా అని టీడీపీలోనే అనుకుంటున్న పరిస్థితి ఉందిట. బాలయ్య పార్టీ కోసం తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ కి ఉత్సాహం ఇస్తున్నారు. సినీ హీరోగా తన చరిష్మాను ఉపయోగిస్తున్నారు బాలయ్య ప్రకటనలు ప్రెస్ మీట్లను నేషనల్ లెవెల్ లో కూడా మీడియా కవర్ చేస్తే లోకల్ గా ఉన్న తెలుగు పత్రిక అందునా టీడీపీకి ఫేవర్ అని పేరు మోసిన పత్రిక అలా పక్కన ఉంచడం తగునా అంటున్నారు.

అయితే ఆ పత్రికా యజమానికి చంద్రబాబు తరువాత లోకేష్ అంటేనే ఇష్టం అంటున్నారు. మరో వైపు ఏంటి అంటే హిందూపురం సీటులో బాలయ్యను తప్పించాలని వేరే వారికి టికెట్ ఇవ్వాలని కూడా బాబుకు ఆ మీడియా యజమాని సూచిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్యని ఇటువంటి వేళ తొక్కేయాలనుకోవడం పట్ల ఆయన ఫ్యాన్స్ కూడా మధనపడుతున్నారు.

కేవలం ఈ పత్రిక మాత్రమే కాదు టీడీపీకి అనుకూలంగా ఉన్న మరో పెద్ద పత్రిక దాని యజమానికి కూడా మొదటి నుంచి నందమూరి కుటుంబం కంటే నారా కుటుంబమే ఫేవర్ అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ కష్టకాలంలో ఉంది అంతా కలుపుకుని పోవాలి. బాలయ్య అవసరం కూడా ఉంది అంటున్నారు. అన్న గారి బ్లడ్ అయిన బాలయ్య విషయంలో ఇలా వివక్ష చూపించడం వల్ల టీడీపీకే నష్టం అని అంటున్నారు.

టీడీపీకి క్యాడర్ ఉంది. మంచి నాయకులు ఉన్నారు. కానీ అనుకూల మీడియా వారి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి 2019లో అధికారం పోగొట్టుకున్నారు అన్నది పార్టీలో సీనియర్ల భావన. ఇపుడు కూడా వారు కొందరిని పెద్దగా చూపించి మరికొందరిని తగ్గించి కీలక దశలో అనవసర తలనొప్పులు పెట్టాలని చూడడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. మరి బాబుకు అన్నీ తెలుసు ఆయనే చూసుకుంటారు అన్న వారూ ఉన్నారు. సో ఇదీ మ్యాటర్. బాలయ్య ఒక్కరే ఇపుడు నందమూరి ఫ్యామిలీ నుంచి చురుకుగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టడం తొక్కేయాలనుకోవడం వల్ల లాభం కంటే నష్టమే అంటున్నారు.