పారిపోలేదు.. అరెస్టు చేసుకోండి.. : నల్లపరెడ్డి సవాల్
తాను వైద్యం పనిపై చెన్నైకి వెళ్లానని నల్లపరెడ్డి చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోయే టైపు కాదన్నారు తన ను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని తెలిపారు.
By: Tupaki Desk | 10 July 2025 8:36 PM ISTతాను ఎక్కడికీ పారిపోలేదని... పోలీసులు తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకునే అవకాశం ఉందని.. తాను పూర్తిగా సహకరిస్తానని.. వచ్చి అరెస్టు చేసుకోవాలని.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నాయకుడు.. నల్ల పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత, కుటుంబ విషయాలను జోడించి నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. నల్లపరెడ్డి వ్యాఖ్యలను ప్రశాంతి రెడ్డి తీవ్రంగా నొచ్చుకు న్నారు. స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. అయితే.. ఈ విషయం తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యాడని.. ఆయన ఆచూకీ లభించనంత దూరం వెళ్లారని ఓ వర్గం మీడియా లో ప్రచారం ప్రారంభమైంది. దీనిపై స్పందించిన ప్రసన్నకుమార్ రెడ్డి.. తాను ఎక్కడికీ పారిపోలేదన్నా రు. తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
తాను వైద్యం పనిపై చెన్నైకి వెళ్లానని నల్లపరెడ్డి చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోయే టైపు కాదన్నారు తన ను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఇదేసమయంలో తమ ఇంటిపై దాడి చేసిన టీ డీపీ నాయకులు, కార్యకర్తలు, వారిని తెరవెనుక ప్రోత్సహించిన వారిని కూడా అరెస్టు చేయాలని నల్లపరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇంట్లోకి చొచ్చుకుని వచ్చిన వారి వివరాలను పోలీసులకు ఇచ్చానన్నారు. సీసీ టీవీ ఫేటేజీలు సహా.. పలువురు సాక్ష్యాలు కూడా చెప్పారన్నారు.
ఏం జరుగుతుంది?
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఈ వ్యాఖ్యలపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఏం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఆయనను అరెస్టు చేస్తారా? లేక.. ఎలాంటి స్టెప్ ఉం టుందని అన్ని వర్గాలుఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే.. స్థానిక రెడ్డి సామాజిక వర్గంలో నల్లపరెడ్డి పై ఉన్నసానుభూతి.. వారితో ఉన్న వ్యాపార, స్నేహ పూర్వక సంబంధాల నేపథ్యంలో `రాజీ` దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి టీడీపీకి చెందిన ఇద్దరు రెడ్డి ఎంపీలే రంగంలోకి దిగారని సమాచారం.
