Begin typing your search above and press return to search.

ఈ రైల్వే స్టేషన్ లో ఆత్మలు..! సాయంత్రం అయ్యిందంటే వణుకే..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్‌ సమీపంలో ఉన్న ‘నైని రైల్వే స్టేషన్’‌కి వెళ్ళే వారు చాలా మంది. కానీ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం కొంత అసాధారణంగానే ఉంటుంది అంటున్నారు అక్కడి స్థానికులు.

By:  Tupaki Desk   |   31 Aug 2025 12:00 AM IST
ఈ రైల్వే స్టేషన్ లో ఆత్మలు..! సాయంత్రం అయ్యిందంటే వణుకే..?
X

ఒక సాదారణ రైల్వే స్టేషన్ లాగా కనిపించే ఈ స్థలం వెనుక అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయని ఊహించగలరా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్‌ సమీపంలో ఉన్న ‘నైని రైల్వే స్టేషన్’‌కి వెళ్ళే వారు చాలా మంది. కానీ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం కొంత అసాధారణంగానే ఉంటుంది అంటున్నారు అక్కడి స్థానికులు. ప్రయాగ్ రాజ్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌కు పక్కనే ఉన్నది ‘నైని జైలు’. ఈ జైలు బ్రిటిష్ కాలం నాటి గాఢ చీకటి చరిత్రను చూపిస్తోంది. అప్పట్లో స్వాతంత్ర సమరయోధులను అందులో నిర్బంధించి, హింసించి, కొంతమందిని అక్కడే ఉరి తీశారు. చాలా మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు కేవలం చరిత్రలో మిగిలిపోలేదు.. ఆ ఆత్మలు ఈ రోజు కూడా నైని రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయంటారు స్థానికులు.

సాయంత్రం అయ్యే సరికి నరకమే..!

సాయంత్రం అయ్యే సరికి ఈ స్టేషన్ పరిసరాల్లో వాతావరణం మారిపోతుందని చెబుతున్నారు. రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు వినిపించడమో, ఆకస్మికంగా చీకటి మూలల నుంచి ఏడుపులు, అరుపులు వినిపించడమో సాధారణమని కొందరు ప్రత్యక్షంగా అనుభవించినట్లు చెబుతున్నారు. అక్కడి ప్రయాణికులలో కొందరు రాత్రివేళ రైలు కోసం వేచిచూస్తున్నప్పుడు అవాచిన భావాలు, గాలి లో ఊహించలేని చలి, ఎవరైనా ఎదురుగా ఉన్నట్లు అనిపించడం వంటి అనుభవాలను పంచుకున్నారు. దీనివల్ల కొంతమంది అటువైపు ప్రయాణించడానికే వెనుకాడుతున్నారట.

కేవలం ఓ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు..

ఇది కాల చక్రంలో నిక్షిప్తమైన ఓ దుర్మర కథ. బ్రిటిష్ వారి దుర్మార్గపు పాలనలో బలైపోయిన ప్రాణాల ఆవేశాలు ఇక్కడ ఇంకా వీచుతున్న గాలిలో పలకరిస్తున్నాయేమో అనిపిస్తుంది.

ఇది కేవలం ఊహా? లేక నిజంగా ఆత్మల ఉనికి? ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు… ఈ స్టేషన్ దాటి వెళ్లే ప్రతి ప్రయాణికుడికీ ఆ గాఢమైన చీకటి వెన్నులో జలదరింపజేస్తుంది.