Begin typing your search above and press return to search.

నాగబాబు వార్నింగ్... జనసైనికులు అలాచేసే చర్యలు తప్పవు!

కూటమిలో భాగంగా టిక్కెట్లు దొరకని అభ్యర్థులు వారికి సంబంధించిన అనుచరులు తమ నిరసనను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2024 5:09 AM GMT
నాగబాబు వార్నింగ్... జనసైనికులు అలాచేసే  చర్యలు తప్పవు!
X

కూటమిలో భాగంగా టిక్కెట్లు దొరకని అభ్యర్థులు వారికి సంబంధించిన అనుచరులు తమ నిరసనను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా జెండా మోస్తూ పార్టీకి ఎంతో సేవ చేస్తున్న నేపథ్యంలో... పైగా టిక్కెట్ ఇస్తున్నామని అధినేత హామీ ఇచ్చిన తరుణంలో... అన్ని పనులూ చక్కబెట్టుకుని సిద్ధపడిన తర్వాత టిక్కెట్ లేదంటే ఆ బాద ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలిసిందే. అది నాగబాబుకి కూడా తెలియంది కాకపోవచ్చు.

అలా అని గ్రౌండ్ లెవెల్లో తిరిగే నాయకులకు తెలిసినంత కాకపొయినా ఎంతో కొంత మాత్రం అనకాపల్లి విషయంలో అయినా కచ్చితంగా తెలిసి ఉంటుంది! ఈ సమయంలో పవన్ కల్యాన్ హామీ ఇచ్చి కూడా టిక్కెట్లు దక్కని, కోట్లు ఖర్చుపెట్టి సిద్ధపడిన నాయకులు, వారి అనుచరులు ఇప్పుడు కూటమికి అతిపెద్ద సమస్యగా మారారని అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వార్నింగ్ ఇచ్చారు.

అవును... టిక్కెట్ దక్కకపోవడంతో తమ నిరసనను ప్రజాస్వామ్య బద్దంగా తెలియజేస్తున్న నేతలకు, కార్యకర్తలకు.. జనసేన పార్టీ కీలక నేత నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు! ఇందులో భాగంగా... జనసేన పార్టీ 20 మంది అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయమే అంతిమం అని.. ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తర్వాతే పవన్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయం అందరూ అర్ధం చేసుకోవాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత.. అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికల మీద, మీడియా, సోషల్ మీడియాల్లోనూ ఎవరైనా మాట్లాడితే.. అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతోందని అన్నారు. ఇలాంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు!

దీంతో... బుజ్జగించాల్సిన సమయంలో ఈ హెచ్చరికలు ఏమిటి అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో కార్యకర్తలు హర్ట్ అయితే... అసలుకే ఎసరు వస్తుందనే విషయం పార్టీ పెద్దలు మరిచిపోకూడదని సూచిస్తున్నారు.

ఆ హెచ్చరికల సంగతి అలా ఉంటే... మరోవైపు, పార్టీ నిర్వహణ అవసరాల కోసం రూ.10 కోట్లు స్వార్జితాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్... ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏ.వి.రత్నం కు చెక్కును అందజేశారు.