Begin typing your search above and press return to search.

జనసేన నాగబాబు : తెలంగాణలో ఓటేసి ఏపీలో దరఖాస్తు...!?

సరే నాగబాబు ఓటేయడం తప్పు కాదు. ఒక పౌరునిగా ఆయన బాధ్యత. అయితే రచ్చ ఎందుకు అంటే ఆయన తిరిగి తనకు ఏపీలో ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు అని.

By:  Tupaki Desk   |   17 Dec 2023 3:00 AM GMT
జనసేన నాగబాబు :  తెలంగాణలో ఓటేసి ఏపీలో దరఖాస్తు...!?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఉండేది హైదరాబాద్ లో. దాంతో ఇటీవల తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటేశారు అని ప్రచారం సాగింది. కుటుంబ సమేతంగా నాగబాబు పోలింగ్ బూత్ వద్ద నిలబడిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేశారు.

సరే నాగబాబు ఓటేయడం తప్పు కాదు. ఒక పౌరునిగా ఆయన బాధ్యత. అయితే రచ్చ ఎందుకు అంటే ఆయన తిరిగి తనకు ఏపీలో ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు అని. దాంతో వైసీపీ రచ్చ చేస్తోంది. ముందు తెలంగాణాలో ఓటేసి ఏపీకి ఏలా బదిలీ చేసుకుంటారు. ఆయనకు ఓటు హక్కు చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది అంటూ వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.

ఇదిలా ఉంటే నాగబాబు తాజాగా ఏపీలోని తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరంలో తనకు ఓటు కావాలని ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీని మీద వైసీపీ నాయకులు అయితే మండిపడుతున్నారు. ఎవరికైనా ఓటు హక్కు ఒక్క చోటనే ఉంటుంది. నాగబాబు ఒక దీనికి అతీతం కాదు అని వైసీపీ నేతలు అంటున్నారు

ఆయనకు ఏపీ మీద ప్రేమ ఉంటే తెలంగాణా ఎన్నికల కంటే ముందే ఎందుకు ఓటుకు దరఖాస్తు చేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆయన తెలంగాణాలో ఓటేసింది ఖైరతాబాద్ నియోజకవర్గంలో అని చెబుతున్నారు. అక్కడ ఉన్న ఒక పోలింగ్ బూత్ లో నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, కుమారుడు వరుణ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు అని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో ఓటు హక్కు వాడుకున్న నాగబాబు ఇపుడు ఏపీలో ఎలా ఓటు హక్కు కోసం ముందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో నాగబాబు ఒక చిరునామా ఇచ్చి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తీరా ఆ అడ్రస్ కి బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి విచారిస్తే ఆ ఇంటికి తళం వేసి ఉంది అని అంటున్నారు. ఇక దీని మీద పోలింగ్ అధికారులు పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. నాగబాబు తమ ముందు హాజరు కావాలని వారు కోరారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎవరైనా ఒక్కటే ఓటు కదా. మరి ఇదేంటి అని అంటున్నారు. పైగా నాగబాబు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన వారు ఆయనకు తెలియవా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక పోతే కేవలం నాగబాబు ప్రజలకు తెలిసిన వారు కాబట్టి అది బయటకు వచ్చింది కానీ ఎప్పటి నుంచో తెలంగాణాలో ఏపీలో రెండు ఓట్లు ఉన్న వారు ఉన్నారని అంటున్నారు. అక్కడ ఓటేసి ఏపీకి వచ్చి ఓట్లు వేసే వారు ఎపుడూ పెద్ద ఎత్తున ఉన్నారని అంటున్నారు. దీని మీద ఎన్నికల అధికారులు విచారించి తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది అని అంటున్నారు.