Begin typing your search above and press return to search.

పిఠాపురం జనసేన క్యాడర్ కి నాగబాబు షాకింగ్ ఆదేశాలు

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఆ పార్టీలో కీలకమైన వారు అన్నది తెలిసిందే. అధినేత పవన్ కి స్వయంగా సోదరుడు అయిన నాగబాబుకు జనసేన క్యాడర్ తో నేరుగా కనెక్షన్ ఉంది.

By:  Tupaki Political Desk   |   24 April 2026 9:00 AM IST
పిఠాపురం జనసేన క్యాడర్ కి నాగబాబు షాకింగ్ ఆదేశాలు
X

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఆ పార్టీలో కీలకమైన వారు అన్నది తెలిసిందే. అధినేత పవన్ కి స్వయంగా సోదరుడు అయిన నాగబాబుకు జనసేన క్యాడర్ తో నేరుగా కనెక్షన్ ఉంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ ని కలుపుకొని పోయే విధంగా అనేక సార్లు పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు సడెన్ ట్రిప్ వేశారు. అయితే ఇటీవల జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పిఠాపురంలో సీన్ ఉంది పాడా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఫ్లెక్సీల విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అండ్ కో చేసిన ఆందోళన జనసేన లోకల్ లీడర్స్ నుంచి వచ్చిన భారీ రియాక్షన్ ఇవన్నీ ఏపీలో పొలిటికల్ హీట్ ని పెంచేశాయి. దీని మీద టీడీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో నాగబాబు కూడా పిఠాపురం రావడంతో ఈ టూర్ వెనక ఏమిటి మ్యాటర్ అన్నది అందరిలో ఆలోచనలు రేకెత్తించింది.

పనిచేసుకోవాలి :

ఇక నాగబాబు పార్టీ నాయకులు క్యాడర్ తో మీటింగ్ ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వారిని పనిచేసుకోవాలని సూచించామని చెప్పారు. దాని అర్థం అనవసరమైన వివాదాలతో తలదూర్చకుండా ఉండాలని చెప్పడమే అంటున్నారు. టీడీపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చినా వెంటనే కౌంటర్లు వేయడం వారితో నేరుగా రాజకీయ ఘర్షణలకు దిగడం వంటివి వద్దు అన్నట్లుగానే జనసేన నుంచి సూచనలు వచ్చాయని అంటున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు పవన్ కలసికట్టుగా ఉంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో అదే తీరు కనబరచాలని ఈ ఇద్దరు అధినేతలు కోరుతున్నారు. కానీ పిఠాపురంలోనే తరచూ వివాదాలు రేగడంతో అది రచ్చగా మారి రెండు పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. దాంతో నాగబాబు పార్టీ నేతల క్యాడర్ సమావేశంలో కూడా కాసింత అసహనం వ్యక్తం చేశారు. అంతా కలసికట్టుగా పనిచేసుకోవాలని ఆయన సూచించారు.

హామీలు అన్నీ తీరుస్తాం :

పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అని నాగబాబు మీడియాతో అన్నారు. అందువల్ల తాము ఎన్నికల్లో ఒక మాట ఇచ్చామంటే తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పారు. మాట ఇచ్చామంటే మడమ తిప్పమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పార్టీ క్యాడర్ అంటే తమ సొంత కుటుంబం అని ఆయన అన్నారు. వారి ఆవేశాన్ని ఆవేదనను తాను అర్ధం చేసుకున్నాను అని పవన్ కళ్యాణ్ కూడా తొందరలోనే వారి సమస్యలు తీరుస్తారు అని అన్నారు. అలాగే ఉప్పాడకు రిటైనింగ్ వాల్ ని నిర్మిస్తున్నామని అదే విధంగా రానున్న మూడేళ్ళ కాలంలో పవన్ నియోజకవర్గానికి పూర్తి హామీలు నెరవేరుస్తారు అని నాగబాబు చెప్పారు.

క్లాస్ పీకిన నాగబాబు :

ఇక పార్టీ సమావేశంలో నాగబాబు క్యాడర్ కి సున్నితంగానే క్లాస్ పీకారు అని అంటున్నారు. తమలో తాము వివాదాలు గొడవలు కాదు అసలు పవన్ కళ్యాణ్ హెల్త్ ఎలాగుంది అని ఎవరైనా అడిగారా అని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు. నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం పవన్ తన హెల్త్ ని సైతం లెక్క చేయకుండా పనిచేశారు అని గుర్తు చేశారు. ఇది తెలుసుకుని అంతా పనిచేయాలని అన్నారు. అదే మాటను మీడియాతో మాట్లాడుతూ తొందరలోనే పవన్ కోలుకుని మళ్ళీ జనంలోకి వస్తారు అని అన్నారు. ప్రస్తుతానికి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. మొత్తం మీద చూస్తే పిఠాపురం విషయంలో జనసేన కూడా పూర్తి ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు. రెండు పార్టీల నుంచి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలని అధినాయకత్వాలు రంగంలోకి దిగిన నేపథ్యం కనిపిస్తోంది. మరి పనిచేసుకుంటూ వెళ్ళండి అని పవన్ సందేశాన్ని నాగబాబు క్యాడర్ కి వినిపించారు. దానికి అనుగుణంగా వారు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.