Begin typing your search above and press return to search.

వైరల్... నాదెండ్ల పక్కన పవన్ ప్లేస్ లో జగన్ కటౌట్!

"కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు" అని చెప్పే సందర్భం కాదు కానీ... గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో కటౌట్ల కు సంబంధించిన చర్చ బలంగా సాగుతుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:22 AM GMT
వైరల్... నాదెండ్ల పక్కన పవన్  ప్లేస్  లో జగన్  కటౌట్!
X

"కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు" అని చెప్పే సందర్భం కాదు కానీ... గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో కటౌట్ల కు సంబంధించిన చర్చ బలంగా సాగుతుంది. భీమిలిలో జరిగిన వైసీపీ "సిద్ధం" సభా ప్రాంగణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ల కార్టూన్ కటౌట్లు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జనసేన ప్రెస్ మీట్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కటౌట్ దర్శనమిచ్చింది.

అవును... విజయవాడలో ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నాదేండ్ల మనోహర్ పక్కన కుర్చీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కటౌట్ ను పెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన మనోహర్... ఎలాగో ముఖ్యమంత్రికి ప్రెస్ మీట్ పెట్టడం చేతకాదు.. మీడియాతో మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి.. జనసేన తరపున తామే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టాము అని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఇప్పటివరకూ ముఖ్యమంత్రి ఎక్కడా ప్రెస్ కాన్ ఫరెన్స్ లు పెట్టరు, ఎవరుతోనూ కూడా చర్చించారు.. అందుకే ఈ రోజు ముఖ్య అతిధిగా జగన్ మోహన్ రెడ్డి ని కూడా ప్రెస్ కాన్ ఫరెన్స్ కి తాము ఆహ్వానించినట్లు తెలిపారు. అనంతరం... ఏపీ అప్పులు, ఆర్ధిక పరిస్థితి లెక్కల చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యామంత్రి సిద్ధమా అని నాదెండ్ల ప్రశ్నించారు.

ఈ క్రమంలో విజయవాడ నగరంలోనే, తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే, జర్నలిస్టుల ముందు కూర్చుని... ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు మొదలైన విషయాలపై చర్చిద్దామని తెలిపారు. ఈ ఐదేళ్లలో లెక్కలు తారుమారు చేశారని చెప్పుకొచ్చారు.. ఫలితంగా అభసుపాలవుతున్న విషయాన్ని అంతా గ్రహించాలని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితిపై చర్చించేందుకు సంస్కారంతోటి, మర్యాదతోటి తాము ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నామని.. ఒక వేదికను ఏర్పాటు చేసుకుందామని.. రాష్ట్ర ప్రయోజనాలకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... "జనసేన ప్రెస్ మీట్ లో ఎప్పుడూ నాదెండ్ల పక్కన పవన్ కనిపించే చోట ఇప్పుడు జగన్ కటౌట్" కనిపించడం ఆసక్తిగా మారింది.