కైలాస పర్వతం ఒక అద్భుత మిస్టరీ !
ఈ మానస సరోవరం నుంచి పుట్టిన నదినే సరయూ నదిగా చెబుతారు. ఈ నది అయోధ్యలో కనిపిస్తుంది. ఇక కైలాస పర్వతం గురించి అన్ని మతాలలోనూ ఉంది.
By: Tupaki Desk | 22 July 2025 11:16 PM ISTఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వింతలు విడ్డూరాలు కూడా ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి. అంతే కాదు వాటిని మన దేశీయ చరిత్రకు ఇతిహాసానికి మూలాలకు ముడిపెడుతూ తెలుసుకుంటేనే ఆ అద్భుత్వమైన రహస్యాలను ఆస్వాదించగలం.
ఇక కైలాస పర్వత్వం గురించి ఎంతో మంది చెబుతూ ఉంటారు. అక్కడ ఏముంది అంటే ఏదో ఉందని చెబుతారు. కానీ ఏమిటో ఎవరికీ తెలియదు. అది మాయ అన్న వారు ఉన్నారు, మహత్తు అన్న వారు ఉన్నారు. అయితే ఎవరో ఏదో చెప్పారని కాకుండా మన ఇతిహాసాల నుంచి కూడా తిరగేసి చూస్తే కనుక నిజంగా అది ఒక బ్రహ్మ పదార్ధమే. అది ఒక మిస్టరీనే.
కైలాసం మంచు పర్వతం. ఈ రెండూ కలిపితే ఆధ్యాత్మికంగా ఏమి తోస్తుంది అన్నది చూడాలి. పరమ శివుడు మంచు పర్వతం మీద ఉంటాడు. ఆయన తనలో సగం అయిన పార్వతితో కలసి కొలువు తీరు ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు కైలాస పర్వతంలో మానస సరోవరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని కూడా పురాణాలు చెబుతాయి.
ఈ మానస సరోవరం నుంచి పుట్టిన నదినే సరయూ నదిగా చెబుతారు. ఈ నది అయోధ్యలో కనిపిస్తుంది. ఇక కైలాస పర్వతం గురించి అన్ని మతాలలోనూ ఉంది. అది వారి వారి పరిభాషాల్లో వారి భావనల్లో విశ్లేషించుకుంటూ ఉంటారు. హిందూ మతంలో బౌద్ధంలో జైన మతంలో కూడా కైలాస పర్వతం గురించి ఎంతో కీలక అంశాలు ప్రస్తావనలు ఉన్నాయి. అంతే కాదు వాటి చుట్టూ ఆధ్యాత్మిక భావనలు కూడా ఉద్దేశించబడ్డాయి.
మరి ఇంతటి ఆధ్యాత్మికపరమైన ఈ పర్వతం ఉంది కదా మరి ఎవరైనా ఇప్పటిదాకా దీనిని అధిరోహించారా అంటే ఎవరూ ఎక్కలేదు అన జవాబు వస్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యకరం కదూ. ఎక్కాలని అనిపించలేదా లేదా ఎక్కే ప్రయత్నం ఫలించలేదా అంటే దాని మీద కూడా ఎంతో హిస్టరీ మిస్టరీ ఉందని చెప్పాలి. ఇవాళ చూస్తే టిబెట్ లో ఈ కైలాస పర్వతం ఉంది. ఇది చైనా దేశంలో ఉంది. ఆరు వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంది. మరి దీని కంటే ఎంతో ఎత్తున ఉన్న ఎవరెస్టుని ఎక్కగలిగిన వారు కైలాశ పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ఇదే కీలకమైన ప్రశ్న.
ఇప్పటిదాకా ఎవరెస్ట్ శిఖరాన్ని ఏడు వేల మంది దాకా ఎక్కినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మరి కైలాశ పర్వతాన్ని ఎందుకు వదిలేశారు అన్నదే కదా మౌలికమైన ప్రశ్న. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఏవీ జరగలేదు. ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా భావించి అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చేయలేదని చెబుతారు.
1926 లో హ్యూగ్ రట్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి 6000 అడుగుల ఎత్తున్న శిఖరాగ్రం ఎక్కడం చాలా కష్టతరమైనదని తీర్మానించారని చెబుతారు. 1936లో హెర్బర్డ్ టీచీ గుర్లా అనే ఆయన మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని న్‌గారీకి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగగా, ఆ గార్పోన్ వ్యక్తి పూర్తిగా పాపరహితమైన వ్యకులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షిలాగ మారి శిఖరాగ్రానికి ఎగరగలరని సమాధానిమిచ్చారని చెబుతారు.
ఇక చూస్తే 1980వ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం, ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన, రైన్‌హోల్డ్ మెస్నర్ కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశమిచ్చింది కానీ ఆయన దాన్ని తిరస్కరించారని చెబుతారు. 2001లో చైనా ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతినిచ్చింది కానీ, అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొగ్గి పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించేందుకు చైనా నిర్ణయించింది. ఆ తరువాత చైనా భారత నేపాలు ప్రభుత్వాలు ఈ కైలాస పర్వతం ఎక్కరాదని అనధికార నిషేధాన్ని ప్రవేసపెట్టాయి.
ఇక కైలాస పర్వతం చుట్టూ తిరిగితే పాపాలు అన్నీ కడిగేసుకోవచ్చు అన్నది ఆధ్యాత్మిక విశ్వాసం. అది ఏకంగా 52 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే సెంటర్ పాయింట్ లో కైలాశ పర్వతం ఉంది. బ్రహ్మపుత్ర సహా మన దేశంలో పారే నదులు అన్నింటికీ కైలాస పర్వతమే స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాలి. మానస సరోవరంలో మంచి నీరు ఉంటే పక్కనే ఉన్న రాక్షస్తల్ లో ఉప్పు నీరు ఉటుంది. ఇది ఎంత విడ్డూరమో అని కూడా అంటారంతా.
ఇక కైలాస పర్వతం మన భారతీయ ధర్మంలో ఇతిహాసాలలో ఉంది. ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే అనేక మతాల కంటే ముందే కైలాస పర్వతం దాని వెనక ధర్మం ఉన్నాయని చెప్పక తప్పదు. ఆకాశదేవత నివసించే స్థలం అని నమ్మే వారు ఉన్నారు. జైనిజంలో అష్టపాద అని ఈ పర్వతాన్ని పిలుస్తారు.
దేవుడు అక్కడ ఉంటాడు అన్నది మాత్రం అన్ని మతాలు అంగీకరించే అసలు వాస్తవంగా చూడాల్సిందే. కలాష్ ప్రజలు వారంతా మహదేవ్ పేరుతో కైలాస పర్వతం మీద ఉన్న శివుడిని కొలుస్తారు. కలాష్ ప్రజలు ఉత్తర పాకిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వతాలలో, ముఖ్యంగా కలాషా లోయలలో నివసించే ఒక స్వదేశీ సమూహంగా ఉంటారు. వారు తమ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు విభిన్న భాషకు ప్రసిద్ధి చెందారు.
ఇది చుట్టుపక్కల పాకిస్తాన్ జనాభా నుండి భిన్నంగా ఉంటుంది. కలాష్ ప్రజలు వారి ప్రత్యేకమైన శారీరక లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందారని చెబుతారు. వీరంతా వేదాల నాటి నుంచి ఉన్న దేవుళ్ళను కొలవడమే కాదు కైలాశ పర్వతం మీద శివుడిని ఆరాధిస్తారు.
ఈ పర్వతం గురించి తెలుసుకోవాలంటే ఎవరో చెప్పారని కాదు, ఎవరో ఏదో పరిశోధిస్తున్నారని కాదు, ఇది మన ధరం, ఇది అన చరిత్ర అని దీని గురించి ప్రతీ భారతీయుడూ తెలుసుకోవాలి.
హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా కైలాస పర్వతం భావిస్తారు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇది ఎప్పటికీ ఒక అద్భుతమే.
