Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ చనిపోలేదా? హత్య చేశారా?

తన తండ్రి కూర్చున్న వైపునే లక్ష్యంగా చేసుకొని వాహనంతో ఢీ కొట్టినట్లుగా సాబ్జీ కుమారుడు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 6:18 AM GMT
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ చనిపోలేదా? హత్య చేశారా?
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. తన తండ్రిది రోడ్డు ప్రమాదం కాదని.. హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నట్లుగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే షేక్ సాబ్జీ కుమారుడు. పక్కా ప్లాన్ తోనే తన తండ్రిని చంపేశారని.. దాన్ని రోడ్డు ప్రమాదంగా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

తన తండ్రి కూర్చున్న వైపునే లక్ష్యంగా చేసుకొని వాహనంతో ఢీ కొట్టినట్లుగా సాబ్జీ కుమారుడు చెబుతున్నారు. పశ్చిమగోదారి జిల్లా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డుప్రమాదం పెను సంచలనంగా మారటం తెలిసిందే. తన తండ్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సాబ్జీ సోదరుడు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా తమ్ముడి మరణం ప్రమాదంతో జరగలేదు. ప్లాన్ చేసి చంపేశారు. మా తమ్ముడి మీద కక్ష కట్టారు’’ అని ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాశీం ఆరోపించారు.

గతంలోనూ ఆయనపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు. చంపాలన్న ఉద్దేశం లేకుంటే గంటకు 140కిలోమీటర్ల స్పీడులో వచ్చి కారును.. ఒకవైపు బలంగా ఢీ కొట్టటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని కుట్రపూరితంగా అంతమొందించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాబ్జీ మరణం రాజకీయ రగడకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణ జరిపించాలన్న డిమాండ్ వస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోస్టుమార్టం సైతం నిర్లక్ష్యంగా చేసినట్లుగా విమర్శలు వస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం అంబులెన్సులోకి ఎక్కిస్తుండగా సాబ్జీ డెడ్ బాడీ నుంచి తీవ్రరక్తస్రావమైంది. సరిగా కుట్లు వేయని కారణంగానే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. దీంతో.. మళ్లీ ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేసి పంపారు. ఒక ఎమ్మెల్సీ మరణంపై సంచనలంగా మారిన ఉదంతంలో వైద్యులు.. వైద్య సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.

అనునిత్యం ప్రజలతో మమేకం అయ్యే ఎమ్మెల్సీ సాబ్జీని చంపే పరిస్థితి ఎవరికి ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. అంగన్ వాడీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీనికి హాజరైన ఎమ్మెల్సీ సాబ్జీ.. వారికి మద్దతు తెలిపిన అనంతరం ఏలూరు నుంచి తన వాహనంలో బయలుదేరారు. భీమవరం నుంచి అకివీడు వైపు వెళుతున్న ఆయన వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఆ కారు ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా రావటం గమనార్హం. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్.. ఎమ్మెల్సీ గన్ మెన్ .. ఆయన పీఏలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భీమవరం ఆసుపత్రికి తరలించారు.

సీఎం జగన్ నిర్వహిస్తునన కేబినెట్ భేటీ వేళలోనే ఎమ్మెల్సీ రోడ్డు యాక్సిడెంట్ గురించి తెలిసినంనతే..ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేబినెట్ భేటీని నిర్వహించారు. ఎమ్మెల్సీ మరణంపై విపక్ష నేత చంద్రబాబు స్పందించారు. తన సంతాపాన్ని తెలియజేశారు. చివరి ఘడియల్లోనూ ప్రజా సేవలో గడిపారన్నారు.

ఉపాధ్యాయుడైన సాబ్జీకి క్లీన్ చిట్ ఉంది. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఎక్కువ. ప్రభుత్వ టీచర్ గా ఐదేళ్ల సర్వీసు మిగిలిన ఉండగానే వీఆర్ఎస్ తీసుకొన్నారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమాన్ని ముందుండి నడిపారు. ఏలురునుంచి విజయవాడ వరకు పాదయాత్రకు నాయకత్వం వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయనకు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మంచి పేరుంది. ఆయన మరణం షాకింగ్ గా మారింది.