Begin typing your search above and press return to search.

మనిషి బుర్రలో చిప్ పెట్టిన మస్క్... సక్సెస్ అంట!

ఈ విషయాలపై తాజాగా న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:33 AM GMT
మనిషి బుర్రలో చిప్  పెట్టిన  మస్క్... సక్సెస్  అంట!
X

ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మనిషి మరణాన్ని తప్ప ఆల్ మోస్ట్ అన్నింటినీ జయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మానవ మెదడులో చిప్ పెట్టేవరకూ వచ్చాడు. ఈ విషయాలపై తాజాగా న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కీలక విషయాలు వెల్లడించారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన "న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌"ను గుర్తించినట్లు తెలిపారు.

అవును... సాధరణంగా ఎవరైనా కాస్తా తేడాగా మాట్లాడుతున్నా.. చెప్పింది అర్ధం చేసుకోలేకపోతున్నా.. "చిప్ పోయిందా" అని అడుగుతుంటుంటారు! అయితే ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చబోతుంది. ఒక మనిషి మెదడులో చిప్ పెట్టే కార్యక్రమాన్ని పూర్తిచేసినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. అలా చిప్ అమర్చబడిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ఈ చిప్ అమర్చే కార్యక్రమం సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలు తాజా వెల్లడించారు.

మెదడులో చిప్... ఎలా పనిచేస్తుంది..?

కంప్యూటర్‌ తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే "బ్రెయిన్‌ - కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌"లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మాత్రమే మందంగా ఇవి ఉంటాయి. ఈ క్రమంలో ముందుగా పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 చిప్ ని అమరుస్తారు. అనంతరం ఈ చిప్‌ కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి పంపిస్తారు.

అవి సుతిమెత్తగా అటు ఇటూ వంగేలా ఉండటంతో... మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి అవి చిప్‌ కు పంపుతాయి. ఇలా ఒక చిప్‌ లో ఉండే సుమారు మూడువేల ఎలక్ట్రోడ్లు.. దాదాపు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథం లుగా మారుస్తుంది. ఈ క్రమంలో గరిష్టంగా ఒక వ్యక్తి మెదడులో 10 చిప్ లను ప్రవేశపెట్టొచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే పందులు, కోతుల్లో సక్సెస్!:

"బ్రెయిన్‌ - కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌" ప్రయోగాలకు అమెరికా "ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్.డీ.ఏ)" గత ఏడాది మే నెలలో ఆమోదం తెలిపింది. దీంతో... న్యూరాలింక్‌ చిప్‌ ను పందులు, కోతుల్లో సక్సెస్ ఫుల్ గా పరీక్షించారు. ఈ నేపథ్యంలో... ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, మరింత విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు.