Begin typing your search above and press return to search.

ఈ టీచరమ్మ కామపిశాచి.. ప్లస్ టూ కుర్రాడితో బలవంతపు శృంగారం

దేశంలోనే టాప్ 5 అత్యుత్తమ స్కూళ్లలో ఒకటిగా పేరున్న స్కూల్లో.. ఒక పంతులమ్మ చేసిన బలవంతపు కామకేళి ముక్కున వేలేసుకునేలా చేయటమే కాదు.. చివరకు కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.

By:  Tupaki Desk   |   3 July 2025 9:32 AM IST
ఈ టీచరమ్మ కామపిశాచి.. ప్లస్ టూ కుర్రాడితో బలవంతపు శృంగారం
X

గురువు దైవం లాంటి పాతమాటలు పోయి చాలా కాలమే అయ్యింది. ఈ గౌరవప్రదమైన వృత్తికి కళంకళం తెచ్చే ఉదంతాలు చాలానే వెలుగు చూడటం తెలిసిందే. తాజాగా ముంబయిలో వెలుగు చూసిన ఒక ఉదంతం మాత్రం ముక్కున వేలేసుకునేలా చేయటమే కాదు.. మరీ ఇంతనా? అన్నట్లుగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతం చోటు చేసుకుంది ఎక్కడో కాదు. దేశంలోనే టాప్ 5 అత్యుత్తమ స్కూళ్లలో ఒకటిగా పేరున్న స్కూల్లో.. ఒక పంతులమ్మ చేసిన బలవంతపు కామకేళి ముక్కున వేలేసుకునేలా చేయటమే కాదు.. చివరకు కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది. ఇంతకూ జరిగిందేమంటే?

బాధిత బాలుడ్ని సదరు టీచరమ్మ ఫైవ్ స్టార్ హోటళ్లకు.. ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో సెక్సు చేసేది. ఆమె వేధింపులకు ఆ బాలుడు ఇబ్బంది పడేవాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే.. ఆమె వేధింపులు ఎక్కువ కావటంతో తట్టుకోలేని బాలుడు తనకు ఎదురవుతున్న వేధింపులను బయటపెట్టాడు. ప్లస్ టూ పరీక్షలు అయిపోయిన తర్వాత.. ఆ విద్యార్థిని తన వద్దకు తీసుకురావాలంటూ విద్యార్థి ఇంటికి తన పనోడ్ని పంపింది. అతడితో వెళ్లటం ఇష్టం లేని విద్యార్థి.. సదరు టీచరమ్మ పెడుతున్న సెక్సు టార్చర్ ను తల్లిదండ్రులకు చెప్పాడు.

దీంతో.. షాక్ తిన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత కుర్రాడి స్టేట్ మెంట్ తీసుకున్నారు. టీచరమ్మ సెక్సు ప్రపోజల్ ను విద్యార్థి నో చెబితే.. మరో టీచరమ్మ చేత ఒప్పించిన షాకింగ్ విషయం వెలుగు చూసింది. టీచరమ్మ శ్రంగార ప్రపోజల్ కు నో చెప్పిన విద్యార్థికి.. పెద్దవారైన మహిళలతో టీనేజరర్లు లైంగిక సంబంధం పెట్టుకోవటం మామూలేనని చెప్పినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి టీచరమ్మపై ఫోక్సో.. కౌమారన్యాయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ టీచరమ్మ చెప్పిందే చేయాలంటూ సలహా ఇచ్చినమరో టీచర్ మీదా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.