Begin typing your search above and press return to search.

ముకేష్ అంబానీనే మళ్లీ టాప్... టాప్ 10 జాబితాలివే!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ధనవంతుల జాబితాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు

By:  Tupaki Desk   |   3 April 2024 2:37 PM GMT
ముకేష్ అంబానీనే మళ్లీ టాప్... టాప్ 10 జాబితాలివే!
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ధనవంతుల జాబితాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద 83 బిలియన్ డాలర్ల నుంచి 116 బ్బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫోర్బ్స్ జాబితాలో మరోసారి రిచ్చెస్ట్ ఏషియన్ గా నిలిచారు ముఖేష్ అంబానీ. ఇదే సమయంలో 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక ఆసియా దేశస్తుడిగా ఆయన నిలిచారు.

అవును... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ.. ఆసియా, భారత్ ల్లో సంపన్న వ్యక్తిగా ఎదిగారు. ఇదే సమయంలో... ప్రపంచవ్యాప్తంగా 9వ ర్యాంక్‌ తో టాప్-10 జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడుగా ముఖేష్ అంబానీ నిలిచారు. ఇక ఆయన తర్వాత స్థానంలో 84 బిలియన్ డాలర్లతో గౌతం అదానీ ఉన్నారు.

ఇదే క్రమంలో 36.9 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్‌.సి.ఎల్. ఎంటర్‌ ప్రైజ్ చైర్మన్ శివ్ నాడార్ మూడో స్థానంలో నిలిచారు. భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ 33.5 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉండగా... సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ 26.7 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు.

ఈ క్రమంలో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిచుకున్న భారతీయ బిలియనీర్లందరి సంపదా కలిపి 954 బిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం!

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్స్ - 2024 జాబితాలో టాప్ 10 భారతీయులు!

ముఖేష్ అంబానీ - $116 బిలియన్లు - ప్రపంచంలో 9వ ర్యాంక్

గౌతం అదానీ - $84 బిలియన్లు - ప్రపంచంలో 17వ ర్యాంక్

శివ్ నాడార్ — $36.9 బిలియన్లు — ప్రపంచంలో 39వ ర్యాంక్

సావిత్రి జిందాల్ & ఫ్యామిలీ — $33.5 బిలియన్లు — ప్రపంచంలో 46వ ర్యాంక్

దిలీప్ షాంఘ్వీ - $26.7 బిలియన్లు - ప్రపంచంలో 69వ ర్యాంక్

సైరస్ పూనావల్ల — $21.3 బిలియన్లు — ప్రపంచంలో 90వ ర్యాంక్

కుశాల్ పాల్ సింగ్ — $20.9 బిలియన్లు — ప్రపంచంలో 92వ ర్యాంక్

కుమార్ మంగళం బిర్లా — $19.7 బిలియన్లు — ప్రపంచంలో 98వ ర్యాంక్

రాధాకిషన్ దమానీ — $17.6 బిలియన్లు — ప్రపంచంలో 107వ ర్యాంక్

లక్ష్మీ మిట్టల్ - $16.4 బిలియన్లు - ప్రపంచంలో 113వ ర్యాంక్

ప్రపంచవ్యాప్తంగా టాప్-10 బిలియనీర్ల జాబితా:

బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - $233 బిలియన్లు

ఎలాన్ మస్క్ - $195 బిలియన్లు

జెఫ్ బెజోస్ - $194 బిలియన్లు

మార్క్ జుకర్‌ బర్గ్ - $177 బిలియన్లు

లారీ ఎలిసన్ - $114 బిలియన్లు

వారెన్ బఫెట్ - $133 బిలియన్లు

బిల్ గేట్స్ - $128 బిలియన్లు

స్టీవ్ బాల్మెర్ - $121 బిలియన్లు

ముఖేష్ అంబానీ - $116 బిలియన్లు

లారీ పేజ్ - $114 బిలియన్లు