Begin typing your search above and press return to search.

అమ్మాయి జోక్ చేస్తే.. అబ్బాయికి నాలుగేళ్ల జైలు

సోషల్ మీడియా స్నేహాలు. ప్రేమలు మనసులను దేశాల సరిహద్దులను చెరిపేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Sept 2025 4:00 PM IST
అమ్మాయి జోక్ చేస్తే.. అబ్బాయికి నాలుగేళ్ల జైలు
X

సోషల్ మీడియా స్నేహాలు. ప్రేమలు మనసులను దేశాల సరిహద్దులను చెరిపేస్తున్నాయి.కానీ మనసులోకి దూరినంత సులువుగా దేశం దాటేద్దామనుకొని వచ్చిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. ఏంటా లవ్ స్టోరీ.. వారు ఎవరో తెలుసుకుందాం..

పాకిస్థాన్‌ లోని బహావల్పూర్ జిల్లాకు చెందిన యువకుడు ముహమ్మద్ అహ్మద్ ఇప్పుడు తన ఇంటికి తిరిగి చేరారు. భారత యువతితో స్నాప్ చాట్ స్నేహం ప్రేమగా మారింది. కానీ సరిహద్దులు దాటడంతో జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చింది. 2017లో ముంబయికి చెందిన వాసిని అలియా అనే యువతితో స్నాప్‌చాట్‌లో పరిచయం అయ్యింది. సాధారణ చాట్‌తో ప్రారంభమైన ఈ రిలేషన్, ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య గాఢమైన బంధం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారింది.

ప్రేయసిని కలిసేందుకు..

అహ్మద్ తన ప్రేయసితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలని 2021లో భారత సరిహద్దు దాటివచ్చాడు. అయితే 4 డిసెంబరు 2021న జీరో లైన్ వద్ద భారత భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అమ్మాయి సమాధానంతో అంతా షాక్..

తరువాత కోర్టు విచారణల్లో అలియా చెప్పిన సమాధానంతో అందరూ నివ్వెరపోయారు. ఆమె అహ్మద్‌ను భారతదేశానికి రమ్మని జోక్ గా పిలిచానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. తానేదో జోక్ చేస్తే అతను నిజంగా వస్తాడని ఊహించలేదంటూ మరింత షాకిచ్చింది. ముందుగా ఆమె నుంచే ప్రపోజల్ వచ్చిందని, కానీ విధి వక్రీకరించి ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని, ఇందుకు తాను ఆమెను నిందించబోనని అహ్మద్ చెప్పడం గమనార్హం.

ఇదేనా విన్నపం

మొత్తానికి నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత మహమ్మద్ అహ్మద్ చివరకు స్వదేశానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు రెండు దేశాల ప్రభుత్వాలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేశాడు. “భారతీయులైనా, పాకిస్థానీలైనా సరిహద్దుల మధ్య జైలు జీవితం గడుపుతున్న ప్రతి వ్యక్తిని తమ కుటుంబాల దగ్గరకు పంపాలి” అని ఆయన ఆకాంక్షించారు. ఇది ఒక వ్యక్తిగత ప్రేమకథ మాత్రమే కాకుండా, సరిహద్దుల మధ్య సమాజం, మానవ హక్కులు, రాజకీయ వాతావరణంపై కూడా ప్రశ్నలు రేకెత్తించే సంఘటనగా నిలిచింది.

ఈ సంఘటన నేపాల్, భారత్, పాకిస్థాన్ మధ్య మానవత్వ పరమైన అవసరాన్ని, అవినీతిని తొలగించే సంక్షోభాత్మక అవసరాన్ని సూచిస్తుంది. ప్రేమ పేరుతో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రజా మద్దతు, తగిన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో ప్రపంచానికి గుర్తు చేస్తున్నది.