Begin typing your search above and press return to search.

కుటుంబానికి చివరి సారిగా ముద్రగడ చెప్పిందేంటి ?

ఈ క్రమంలో ముద్రగడ కుమారులు బాలు గిరిబాబు ఇద్దరూ కలసి తాజాగా మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు.

By:  Satya P   |   17 July 2026 4:22 AM IST
కుటుంబానికి చివరి సారిగా ముద్రగడ చెప్పిందేంటి ?
X

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి దిగ్గజ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం దివంగతులు అయ్యారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరిగాయి. అయితే ఈ సందర్భంగా కొంత వివాదం నడచింది. ప్రభుత్వ లాంచనాలను ముద్రగడ కుటుంబం తిరస్కరించింది. అలాగే ఆయన ఏకైక కుమార్తె క్రాంతిని కూడా ముద్రగడ పార్ధివ దేహం చూడనీయలేదు. దీంతో ఇవి పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చాయి. అంతే కాదు ముద్రగడ అంత్యక్రియల సందర్భంగా ఇవే ఎక్కువగా హైలెట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు కొందరు చేసిన అతి చర్యలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఇవన్నీ మీడియాలో వార్తలుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ కుమారులు బాలు గిరిబాబు ఇద్దరూ కలసి తాజాగా మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు.

నాన్నగారు చెప్పింది ఇదే :

ముద్రగడ అంత్యక్రియలు ఎలా జరగాలి, ఏమి చేయాలి అన్నది తన తండ్రి తమకు అన్ని విషయాలు చివరి దశలో చెప్పారు అని ఆయన కుమారులు ఆ లేఖలో స్పష్టం చేశారు. తమ తండ్రి నిర్ణయం మేరకే ఆయన అంత్యక్రియల ప్రక్రియ మొత్తం నడిచింది అని వారు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏ లాంచనాలు తమ తండ్రి కోరుకోలేదనీ అందుకే తాము వద్దు అని చెప్పామని అన్నారు. ఇదిలా ఉంటే తమ కుటుంబానికి బార్లపూడి క్రాంతి కుటుంబానికి గత కొన్నేళ్ళుగా రాకపోకలు లేవని అన్నదమ్ములు ఇద్దరూ తన సోదరి విషయంలో అసలు మ్యాటర్ ని బయటపెట్టారు. ఇక ఆమె చివరి చూపునకు రాకూడదు అన్న నిర్ణయం కూడా ముద్రగడదే అని వారు పేర్కొన్నరు.

మమ్మల్ని క్షోభ పెడుతున్నారు :

ఇదిలా ఉంటే మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు అయితే ముద్రగడ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్నాయని బాలు గిరిబాబు ఆ లేఖలో ప్రస్తావించడం విశేషం. అలాంటి కధనాలు ఏవీ మీడియాలో ప్రసారం చేయవద్దు అని మీడియాను వేడుకుంటున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు. ముద్రగడ ఆత్మ గౌరవానికి వ్యక్తిత్వానికి నిలువుటద్దం అని వారు అభివర్ణించారు. అంతా తమ తండ్రి అభీష్టం మేరకే జరిగింది అని వారు వివరించారు.

అనుకున్నట్లుగానే :

ఈ లేఖను బట్టి చూసినా ముద్రగడ సన్నిహితులు ఆయన బాల్య మిత్రులు బంధువులు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి చూసినా ముద్రగడ తాను లేని సందర్భంలో కూడా ఎలా ఏమి జరగాలో అంతా ముందే నిర్ణయించి తన కుటుంబానికి చెప్పారని అంటున్నారు. ఇక ముద్రగడ మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబం కూడా సన్నిహితులు బంధువులు బాల్య మిత్రులను పిలిచి ముద్రగడ చివరి కోరికల గురించి ప్రస్తావించి వాటిని సజావుగా అమలు చేసేలా అంతా కలిసి చూడాలని కోరినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద ముద్రగడ అభీష్టమే నెరవేరిందని ఆయన కోరుకున్నట్లుగానే వెళ్ళిపోవడమే కాదు అంత్యక్రియలు ప్రక్రియ కూడా తాను ముందే దిశా నిర్దేశం చేసినట్లుగానే జరిపించుకున్నారని అంటున్నారు.