Begin typing your search above and press return to search.

ముద్రగడను ఫుల్ గా ఇన్వాల్వ్ చేస్తున్న జగన్!

ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఇలా పార్టీలు మారిన ముద్రగడ వైసీపీలోకి 2024 ఎన్నికల ముందు వచ్చి చేరారు ఇక ఆయన పార్టీలో ఉన్నా కూడా గోదావరి జిల్లాలు మాత్రం కూటమికే జై కొట్టాయి.

By:  Satya P   |   11 Jan 2026 4:33 AM IST
ముద్రగడను ఫుల్ గా ఇన్వాల్వ్ చేస్తున్న జగన్!
X

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గోదావరి జిల్లాలలో ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఆయనది అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం. ఆయన తండ్రి కాలం నుంచి కూడా చూస్తే కనుక ఆరున్నర దశాబ్దాల రాజకీయ ప్రజా జీవితం ముద్రగడ కుటుంబం సొంతం. అయితే ముద్రగడ తన జాతి శ్రేయస్సు కోసం అంకితం అయిపోయారు. లేకపోతే ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించేవారు అని కూడా విశ్లేషిస్తారు.

జగన్ ని కలిసిన వైనం :

ఇదిలా ఉంటే కాంగ్రెస్ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఇలా పార్టీలు మారిన ముద్రగడ వైసీపీలోకి 2024 ఎన్నికల ముందు వచ్చి చేరారు ఇక ఆయన పార్టీలో ఉన్నా కూడా గోదావరి జిల్లాలు మాత్రం కూటమికే జై కొట్టాయి. ఇపుడు నెమ్మదిగా ఇరవై నెలలు కావస్తోంది. దాంతో రాజకీయాలు సామాజిక పరిణామాలు గోదావరి అలల మాదిరిగా మెల్లగా మారుతున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరితో కలసి వైఎస్ జగన్ ని తాజాగా తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో కలిసారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లాలలో పార్టీని బలోపేతం చేస్తున్న తీరు పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు అని అంటున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గిరి వైసీపీని పటిష్టం చేస్తున్న విషయాన్ని కూడా అధినాయకునికి తెలియచేశారు అని అంటున్నారు.

స్ట్రాంగ్ గా చేయాలి :

ఇక ఉభయ గోదావరి జిల్లాలలో రాజకీయంగా మార్పు రాకపోతే ఏపీలో అధికారం అన్నది సాధ్యం కాదని అంటున్నారు వైసీపీ అధినాయకత్వానికి ఆ సంగతి తెలుసు అని చెబుతున్నారు. అందుకే పెద్దాయన ముద్రగడ మీద కీలకమైన బాధ్యతలు పెట్టారని అంటున్నారు ఆయన గతంలో అనారోగ్యం కారణంగా బయటకు పెద్దగా వెళ్ళింది లేదని అంటున్నారు. దానికి తోడు కూటమి పాలనకు కొంత సమయం ఇచ్చి చూడాలని కూడా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు మూడవ వంతు పాలన ముగుస్తోంది కాబట్టి విపక్ష పార్టీగా వైసీపీ ఇప్పటి నుంచే జనంలోకి వెళ్ళాల్సి ఉందని అంటున్నారు. ఈ మేరకు అధినాయకత్వం ముద్రగడను కోరిందని అంటున్నారు. రానున్న కాలంలో మరింత విస్తారంగా పార్టీ కార్యక్రమాలలో ముద్రగడ పాల్గొంటారని అంటున్నారు. అలాగే తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారు అని చెబుతున్నారు.

గేర్ మార్చాల్సిందే :

గోదావరి జిల్లాలలో వైసీపీ గేర్ మారిస్తేనే ఏపీలో పార్టీకి ఉత్తేజం ఉత్సాహం వస్తుంది. మొత్తం 34 అసెంబ్లీ అయిదు పార్లమెంట్ సీట్లు కలిగి ఉన్న అతి పెద్ద ఈ రీజియన్ లో వైసీపీ పటిష్టం కావాలంటే ముద్రగడ వంటి బిగ్ షాట్ చురుకుగా ముందుకు రావాల్సి ఉంటుంది అందుకే జగన్ ముద్రగడను పూర్తి ఇన్వాల్వ్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారని అంటున్నారు. మరి కొత్త ఏడాది వచ్చేసింది. పండుగ తరువాత గోదావరి జిల్లాలో రాజకీయం ఏ విధంగా మారుతుందో చూడాల్సి ఉంది. అదే విధంగా జగన్ జిల్లా పర్యటనలు సైతం ఉత్తరాంధ్ర లేదా ఉభయ గోదావరి జిల్లాలలోనే మొదలవుతాయని చెబుతున్నారు. దీంతో ముద్రగడ కీ రోల్ ప్లే చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. గోదావరి తీరంలో వైసీపీ రాజకీయం ఏ విధంగా ముందుకు సాగుతుందో.