Begin typing your search above and press return to search.

ధోనీ ముంబై జెర్సీ అందుకే వేసుకున్నాడా..?

ఈ సారి ఆయన పేరు మరోలా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) ఆత్మగా, చిహ్నంగా నిలిచిన ధోనీ ముంబై ఇండియన్స్‌ జెర్సీలో దర్శనమివ్వడం అభిమానుల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   8 Oct 2025 1:48 PM IST
ధోనీ ముంబై జెర్సీ అందుకే వేసుకున్నాడా..?
X

భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పేరు చెప్తేనే విక్టరీలు, అద్భుతమైన కేప్టెన్సీ, కూల్ గయ్, డైనమిక్ ప్లేయర్.. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్ లోనే కాదు.. ప్రతి పనిలో కూడా అద్భుతాలను సృష్టించింది. ఈ సారి ఆయన పేరు మరోలా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) ఆత్మగా, చిహ్నంగా నిలిచిన ధోనీ ముంబై ఇండియన్స్‌ జెర్సీలో దర్శనమివ్వడం అభిమానుల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

ధోనీ ముంబై జెర్సీపై సోషల్ మీడియాలో హీట్లు..

ఐపీఎల్‌లో చెన్నై, ముంబై జట్ల మధ్య పోటీ అంటే కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు అదొక భావోద్వేగం. ధోనీ ముంబై జెర్సీ ధరించిన ఫోటో బయటకు రావడంతో సోషల్‌ మీడియా తట్టుకోలేకపోయింది. ‘ధోనీ జట్టు మార్చేశాడా?’ అనే ప్రశ్నలతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. ధోనీ తన ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ ఆడుతున్నప్పుడు ముంబై ఇండియన్స్‌ జెర్సీ వేసుకున్నాడు. ఆ క్షణాన్ని ఫొటో తీసిన వారు నెట్‌లో పెట్టారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఫుట్‌బాల్‌ అంటే ధోనీకి చిన్ననాటి నుంచి ఇష్టం. అంతేకాక, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు సహకారంతో ఆయన ఆడినట్లు తెలుస్తోంది.

భిన్నంగా స్పందిస్తున్న ధోనీ అభిమానులు..

అభిమానుల మనసుల్లో మాత్రం ఆ చిత్రానికి వేరే అర్థం చెప్పుకుంటున్నారు. ‘కెప్టెన్ కూల్‌ బ్లూ జెర్సీలో?’ అంటూ చెన్నై అభిమానులు షాక్‌ అవుతుండగా.. ముంబై అభిమానులు ‘ధోనీ మాకు వస్తే ఎలా ఉంటుందో ఇదే ప్రివ్యూ!’ అంటూ కవ్వింపు పోస్టులతో సోషల్ మీడియాను ఫన్ వైపు నడిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటో చుట్టూ నవరసాలతో కూడిన చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు ‘ఐపీఎల్‌ 2025లో ట్రేడ్‌ కదా?’ అంటూ వ్యంగ్యంగా రాస్తే, ‘ధోనీ ఏ జెర్సీ వేసుకున్నా ఆయనపై ప్రేమ మారదు’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ధోనీ అంటే బ్రాండ్..

ఈ పోస్ట్ ద్వారా మరో విషయం అర్థం అవుతుంది. ధోనీ కేవలం జట్టు సింబల్‌ కాదు.. ఆయన ఒక భావన. ఆయన వేసుకున్న జర్సీ ఇంపార్టెంట్ కాదు.. ఆయన ఆడే స్టయిల్, ఆయన కెప్టెన్సీ ఇంపార్టెంట్. క్రికెట్‌ ప్రపంచంలో ఆయనకు ఉన్న స్థానం ఎవరూ తొలగించలేరు. చెన్నై అభిమానులు నిరాశ చెందనవసరం లేదు ధోనీ ఎప్పుడూ చెన్నైవాడే. కానీ, ఈ చిన్న ఫోటోతో ధోనీ మరోసారి చూపించాడు. ఒక ఫ్రేమ్‌తోనే ఆయన వార్తల్లో నిలవగలడు, అభిమానుల గుండెల్లో తుఫాను రేపగలడు.