Begin typing your search above and press return to search.

అంబటి రాయుడుకు ఎంపీ సీటు...డెసిషన్ కరెక్టేనా...!?

ఇక అంబటి రాయుడు అంటే సాదర జనంలో ఎంతమందికి తెలుసు అన్న ప్రశ్న ఉదయిస్తోంది

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:30 PM GMT
అంబటి రాయుడుకు ఎంపీ సీటు...డెసిషన్ కరెక్టేనా...!?
X

అంబటి రాయుడు. భారత మాజీ క్రికెటర్. ఆయన క్రికెట్ అభిమానులకు మాత్రమే తెలుసు. వారే ఆయన ఫ్యాన్స్ కూడా. అయితే ఈ అభిమానం ఎప్పటికపుడు మారుతూ ఉంటుంది సినీ స్టార్స్ మాదిరిగానే. ఇక అంబటి రాయుడు అంటే సాదర జనంలో ఎంతమందికి తెలుసు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అంబటి రాయుడుని తీసుకుని వచ్చి గుంటూరు వంటి ప్రతిష్టాత్మకమైన సీటుని ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేయాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటోందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది

నిజానికి అంబటి రాయుడుని అక్కడ నుంచి పోటీ చేయించడం కరెక్టేనా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే వరసబెట్టి క్యాండిడేట్లను వైసీపీ మార్చుకుంటూ పోతోంది. కొత్త ముఖం అయినా లేక ఉన్నవారే అయినా వారి ఇమేజ్ కూడా పార్టీకి దోహదపడితే కచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది అన్న లెక్కలతోనే ఈ మార్పు చేర్పులు అన్నీ చేస్తారు.

ఇదిలా ఉంటే అంబటి రాయుడు సొంత జిల్లా గుంటూరు అని అంటున్నారు కానీ ఆయన జన సామాన్యానికి తెలిసింది బహు తక్కువ. బయట జనాలకు ఏ మాత్రం ఆయనకు తెలియదు అని అంటున్నారు. వారికి ఆయన గురించి ఐడియా అన్నది కూడా లేదు. ఈ నేపధ్యంలో ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ అంటే ఆ సీటుకు ఆయన ఎంపిక కరెక్టేనా అన్న డౌట్ కూడా వస్తోంది.

ఇక ఆయన్ని తెచ్చుకోవడం వల్ల సీటు ఇచ్చుకోవడం వల్ల ఒక పార్టీగా వైసీపీని కలిగే బెనిఫిట్ ఏంటి అన్నది కూడా చూడాలని అంటున్నారు. సాధారణంగా ప్రతీ ఎన్నికలోనూ సెలిబ్రిటీస్ రంగంలో ఉంటారు. వారికి అంటూ ఒక ఇమేజ్ కూడా కలుస్తుందని వారికి సీట్లు ఇస్తారు. మరి అంబటి రాయుడు విషయంలో వైసీపీ హై కమాండ్ లెక్కలేంటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

జగన్ ప్రభుత్వం గడచిన కాలంలో ఇచ్చిన పధకాలు అమలు చేసిన సంక్షేమం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుంటే వాటి వల్ల అంబటికి ఏమైనా గెలుపు అవకాశాలు ఉంటాయేమో అన్న మాట కూడా ఉంది. జగన్ ఓటర్లు వేరు, వారికి అంబటితో కనెక్షన్ కూడా పెద్దగా ఉండదని అంటున్నారు.

దాంతో అంబటిని చేర్చుకుని ఎకాఎకిన ఎంపీగా పంపించాలా అన్న చర్చ అయితే సాగుతోంది. పర్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. నిరంతరం జనంలో ఉన్న వారూ ఉన్నారు. వచ్చే ఎన్నికలు కూడా ఒక విధంగా టఫ్ ఫైట్ గానే సాగుతాయి. దాంతో అంబటి రాయుడు ఎంపిక మీద మాత్రం కొంత చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.