Begin typing your search above and press return to search.

షాట్ గన్, గదర్ వీరుడు 17 లోక్ సభలో నోరే మెదపలేదు..

అయితే, 9 మంది ఎంపీలు మాత్రం నోరు మెదపలేదు. వీరిలో ఇద్దరు సినీ ఎంపీలు కావడమే విశేషం.

By:  Tupaki Desk   |   13 Feb 2024 11:07 AM GMT
షాట్ గన్, గదర్ వీరుడు 17 లోక్ సభలో నోరే మెదపలేదు..
X

ప్రస్తుతం పార్లమెంటు 17వ లోక్ సభ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ సభా కాలం ముగియనుంది. చివరి సమావేశాలు కూడా గత వారమే పూర్తయ్యాయి. మరికొద్ది రోజులు మాత్రమే ఈ లోక్ సభ మనుగడ. నెల రోజుల లోపలే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఓ లెక్కన చెప్పాలంటే.. ఇప్పటికే 17వ లోక్ సభ కాలగతిలోకి వెళ్లిపోయింది. మే నెలలో కొలువుదీరేది 18వ లోక్ సభ కానుంది.

సంచలనం రేపిన సభ ఇది..

రైతు చట్టాలు.. ఆర్టికిల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా, లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాలపై వేటు.. ఇలా ఒకటేమిటి..? ఎన్నో సంచలనాలకు వేదికైనది 17వ లోక్ సభ. అలాంటి సభలో ఎన్నోసార్లు వివాదాలు చెలరేగాయి. ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. వాస్తవానికి 16వ లోక్ సభ తో పోలిస్తే ఈసారి విపక్షాల బలం తగ్గిన బలంగా పోరాడాయి. ఈ క్రమంలో చాలామందికి మాట్లాడే అవకాశం వస్తుంది. అయితే, 9 మంది ఎంపీలు మాత్రం నోరు మెదపలేదు. వీరిలో ఇద్దరు సినీ ఎంపీలు కావడమే విశేషం.

లోక్‌ సభ సెక్రటేరియట్ సమాచారం ప్రకారం ఈ 9 మంది ఎంపీల్లో అత్యంత ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. వారు.. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన, గదర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సన్నీ దేవోల్, షాట్ గన్ గా అభిమానులు పిలుచుకునే శతృఘ్న సిన్హా. ఇంకో విషయం ఏమంటే.. పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. ఈయన బెంగాల్‌ లోని అసన్ సోల్ ఎంపీ. గతంలో పట్నా సాహిబ్ నుంచి గెలిచారు. 'గదర్' అంటూ దేశాన్ని ఊపేసిన బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్ కూడా ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. యూపీలోని ఘోసీ ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు.

17వ లోక్‌ స‌భ‌ తొలి సెష‌న్ 2019 జూన్ లో ప్రారంభ‌మైంది. మొత్తం 543 మంది ఎంపీల్లో ఐదేళ్ల‌లో ఎటువంటి చ‌ర్చ‌ల్లో పాల్గొననివారి సంఖ్య 9. ఇందులో ఆరుగురు బీజేపీవారు కాగా.. ఇద్ద‌రు టీఎంసీ, ఒక‌రు బీఎస్పీ ఎంపీ. అంటే. అధికార పార్టీ వారే అధికంగా మౌనం దాల్చారన్నమాట. సిన్హా.. 2022 ఏప్రిల్ లో జ‌రిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ప్ర‌శ్నోత్త‌రాలు, జీరో అవ‌ర్‌ లో స‌న్నీ దేవోల్ ను మాట్లాడాల‌ని స్పీక‌ర్ బిర్లా రెండు సార్లు కోరారు. అయినా అతడు నోరు విప్పలేదు.