Begin typing your search above and press return to search.

ఎంపీ భరత్ ఈసారి అసెంబ్లీకి...!?

ఆయన రాజమండ్రి అర్బన్ నుంచి పోటీకి దిగుతారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే లేటెస్ట్ గా ఒక గాసిప్ లాంటి వార్త ప్రచారంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 11:30 PM GMT
ఎంపీ భరత్ ఈసారి అసెంబ్లీకి...!?
X

వైసీపీకి యువ ఎంపీగా ఉంటూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూనే విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టిన యువ నేత మార్గాని భరత్. ఆయన వైసీపీకి సంబంధించి గోదావరి జిల్లాలలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. భరత్ ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు అని ప్రచారం చాలా కాలంగా ఉంది.

ఆయన రాజమండ్రి అర్బన్ నుంచి పోటీకి దిగుతారు అని కూడా ప్రచారంలో ఉంది. అయితే లేటెస్ట్ గా ఒక గాసిప్ లాంటి వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే భరత్ ని ఈసారి రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ అధినాయకత్వం పోటీ చేయిస్తుందని. ఎంపీ సీటుకు మరో బీసీ నేతను రంగంలోకి దించాలని చూస్తోంది అని అంటున్నారు.

ఈ మేరకు ఎంపీ భరత్ కే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది అని అంటున్నారు. భరత్ కి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టమే అన్నది ఒక మాటగా ఉంది. వచ్చే ఎన్నికల్లో యువతను ముఖ్యంగా బీసీలను పోటీకి దించాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఎక్కువ సీట్లలో అటు వారు ఇటూ ఇటు వారు అటుగా మారుతారు అని అంటున్నారు.

ఇక రాజమండ్రి ఎంపీ సీటుకు పోటీ చేయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు సూచించారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. ఆయన రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ వర్గ పోరు ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కి ఆయనకు అసలు పడడంలేదు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన తోట్ర త్రిమూర్తులుకు కూడా మంత్రితో పొసగడంలేదు.

దాంతో ఈ ఇద్దరు బలం లేకుండా మరోసారి రామచంద్రాపురం సీటుని గెలుచుకోవడం కష్టం.దాంతో అక్కడ కొత్త ముఖాన్ని అవకాశం ఇస్తూ మంత్రిని ఎంపీగా పోటీ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం తలపోస్తోంది అని తెలుస్తోంది.

ఒక వేళ ఆయన కనుక కాకపోతే మరో బలమైన బీసీ నేతను దించాలని కూడా చూస్తోందిట. ఇక కొత్త ముఖం కూడా ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా భరత్ అనుకున్నది ఎమ్మెల్యే గా పోటీ కాబట్టి ఆయన వర్గం హ్యాపీగానే ఉందా అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఇక ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ పోటీ చేయను అని అంటున్నారని ప్రచారంలో ఉంది అక్కడ కూడా కొత్త అభ్యర్ధిని పోటీ చేయిస్తారు అని అంటున్నారు.

వైసీపీ ఇపుడు చాలా చోట్ల అభ్యర్ధుల మార్పు చేర్పులు చేస్తోంది అని తెలుస్తోంది. దీంతో చాలా రకాలుగా గాసిప్స్ అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.