Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో చిత్ర దర్శక నిర్మాత అరెస్టు!

ఇందుకు భిన్నంగా ఈ నెల ఐదున చిత్ర దర్శక నిర్మాత వాసువర్మను అరెస్టు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:26 AM GMT
డ్రగ్స్ కేసులో చిత్ర దర్శక నిర్మాత అరెస్టు!
X

ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్ సంబంధాల లింకులు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

సాధారణంగా సంచలన కేసులకు సంబంధించిన ప్రముఖుల్ని.. సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నా.. అరెస్టు చేసినా వెంటనే ఆ వివరాల్ని వెల్లడిస్తారు పోలీసులు. అంతా పారదర్శకంగా సాగుతుందన్నదే కీలకం.

ఇందుకు భిన్నంగా ఈ నెల ఐదున చిత్ర దర్శక నిర్మాత వాసువర్మను అరెస్టు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ లో సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు ప్రథ్వీ క్రిష్ణ.. రాహుల్ ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 70 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మాదాపూర్ పోలీసులు ఈ నెల 5న వాసువర్మను అరెస్టు చేవారు. ఈ విషయం ఆదివారం నాటికి కానీ బయటకు రాకపోవటం గమనార్హం.

వాసువర్మ.. ప్రథ్వీ క్రిష్ణలు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించి అరెస్టు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీరికి డ్రగ్స్ ను సప్లై చేసిన విక్టర్ పరారీలో ఉన్నారు. అయితే.. ఎప్పుడో జరిగిన అరెస్టుల్ని బయటపెట్టకుండా గోప్యంగా ఉంచటం ఏమిటి? అన్నది ఒక ప్రశ్నగా మారింది.

అయితే.. డ్రగ్స్ ను సప్లై చేసిన వారిని అదుపులోకి తీసుకోవటానికి వీలుగా.. పోలీసులు సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదని చెబుతున్నారు. సంచలన నేరాలకు సంబంధించిన అంశాల్ని రహస్యంగా ఉంచే కన్నా.. ఓపెన్ గాచెప్పేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.