Begin typing your search above and press return to search.

ఏం స్పీడురా నాయనా.. సెకనుకు 150 హెడీ మూవీలు డౌన్ లోడ్

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ తో ఒక హెచ్ డీ సినిమాను డౌన్ లోడ్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:24 AM GMT
ఏం స్పీడురా నాయనా.. సెకనుకు 150 హెడీ మూవీలు డౌన్ లోడ్
X

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ తో ఒక హెచ్ డీ సినిమాను డౌన్ లోడ్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఆ మాటకువస్తే వంద కూడా కాదు. ఏకంగా నూటయాభై హెచ్ డీ సినిమాల్ని సెకను వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకునే సాంకేతికతను క్రియేట్ చేయటం మాటలా? అద్భుతం అనే మాటకు అసలుసిసలు అర్థంగా చైనా తాజా ఆవిష్కరణ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది.

ఇదంతా చూస్తే.. ఏం చేసినా చైనావోడు చేయాల్సిందే అనుకోకుండా ఉండలేం. ఇప్పటికే శస్త్రసాంకేతిక రంగంలో అద్భుతాల్ని క్రియేట్ చేస్తున్న చైనావోడు.. తాజాగా ఆవిష్కరించిన ఈ ఆవిష్కరణ సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్ వర్కును ఆవిష్కరించాయి. ఈ నెట్ వర్కు సెకనుకు 12 టెరాబిట్ల వేగంతో డేటాను ప్రసారం చేసే సత్తా ఉన్నట్లు చైనా చెబుతోంది.

ఈ వేగంతో చూసినప్పుడు 150 హెచ్ డీ సినిమాల్నిసెకనులో డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ అద్భుతాన్ని సంఘువా యూనివర్సిటీ.. చైనా మొబైల్..హువావే టెక్నాలజీస్.. సెర్నెట్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో డెవలప్ చేశారు. ఈ తరహాటెక్నాలజీ అద్భుతం అందుబాటులోకి వస్తే.. ప్రపంచం మరెంత స్పీడ్ అవుతుందో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఏమైనా చైనావోడు చైనావాడే.