Begin typing your search above and press return to search.

ఓ తల్లి చేసిన నీచపు పని... 40 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు!

కంచే చేను మేసింది.. కంటిరెప్పే కనుగుడ్డును పొడిచింది. కన్నకూతుళ్లను ఓ తల్లి మానవత్వం మరిచి కీచకులకు అప్పగించింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 2:30 PM GMT
ఓ తల్లి చేసిన నీచపు పని... 40 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు!
X

కంచే చేను మేసింది.. కంటిరెప్పే కనుగుడ్డును పొడిచింది. కన్నకూతుళ్లను ఓ తల్లి మానవత్వం మరిచి కీచకులకు అప్పగించింది. ఇంకా లోకం పోకడ తెలియని పసిపిల్లలను మూర్ఖులకు ఎరగావేసినంతపనిచేసింది. దీంతో... ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోర్టు మాతృత్వానికే మాయని మచ్చగా మారిన ఆమెకు పోక్సో చట్టం కింద 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... కేవలం 7ఏళ్లు, 11ఏళ్ల తన కూతుళ్లను కీచకుడు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పినా వినిపించుకోని తల్లి... కావాలని ఆ కీచకుడి దగ్గరకు ఆపనిమీద ఈ పనిమీద పంపేది. దీంతో ఆ పిల్లలు ప్రత్యక్ష నరకం చూసేవారు. ఎవరికి చెప్పుకోలేక తిరిగి వచ్చి తల్లికే చెప్పుకునేవారు. కానీ ఆమెకు అవేవీ పట్టేవి కావు. తన స్వార్ధం కోసం ఇంత నీచానికి తెగించింది ఆ మహిళ!

వివరాళ్లోకి వెళ్తే... కేరళలో ఓ మహిళ... తన భర్త మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో అతడిని వదిలేసింది. అనంతరం శిశుపాలన్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ సమయంలో ఏడేళ్ల కూతురు ఆమెవద్దే ఉండేది. ఈ క్రమంలో ఆ శిశుపాలన్ అనే వ్యక్తి తల్లితో సహజీవనం చేస్తూ.. ఈ ఏడేళ్ల పసిబిడ్డను లైంగికంగా వేదించడం మొదలుపెట్టాడు. ఆ వేదింపులకు ఆమె గాయపడింది!

ఆమెకు ఎదురవుతున్న దరుణాలను ఆ పసిప్రాణం తన బాధను తల్లికి చెప్పింది. కానీ, నిందితురాలు ఆ బిడ్డ మాటలు పట్టించుకోలేదు! పైగా... ఆమెను పదేపదే శిశుపాలన్ ఇంటికి పంపించేది. అతడి లైంగిక దాడికి ఈ విధంగా సహకరించింది! ఈ క్రమంలో కొద్దిరోజులకు తన వద్దకు వచ్చిన ఆమె అక్క (11 ఏళ్లు)కు ఆ చిన్నారి తన గోడును చెప్పుకొంది.

ఈ క్రమంలో ఆ మానవమృగం ఆ చిన్నారి అక్కను కూడా వదలలేదని తెలుస్తుంది! ఆమెపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తల్లికి చెప్పినా అనవసరం అని భావించిన పిల్లలు ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా తమ బామ్మ ఇంటికి వెళ్ళిపోయారు. ఆమెకు వారనుభవించిన ప్రత్యక్ష నరకం గురించి తెలిపారు.

దీంతో ఆ బామ్మ ద్వారా ఈ ఘోరం బయటకు వచ్చింది. ఈ సమయంలో పిల్లల్ని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ సమయంలో ఆ బాలికలిద్దరూ తమకు ఎదురైన భయానక పరిస్థితులు, దారుణ సంఘటనలు, తల్లికి చెప్పుకున్నా వినిపించుకోని వైనం మొదలైన అన్ని విషయాలనూ అధికారులకు వెల్లడించారు. ఈ సంఘటన 2018 - 19లో జరిగింది.

ఆ సమయంలో శిశుపాలన్‌ తో పాటు మరో వ్యక్తి కూడా ఆ బాలికలపై లైంగిక దాడి చేసినట్లు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్.ఎస్. విజయ్‌ మోహన్ మీడియాకు వెల్లడించారు. ఈ సమయంలో కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఆ తల్లి చర్యలు మాతృత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ.. 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదే సమయంలో రూ.20వేలు జరిమానా విధించింది. కాగా... ఈ కేసు విచారణ సమయంలోనే మానవమృగం అని చెప్పబడుతున్న శిశుపాలన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ కేసులో 22 మంది సాక్షుల్ని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా 40ఏళ్ల జైలు శిక్ష విధించింది.