90 ఏళ్ల వయసులో లాయర్ గా మారిన తల్లి.. కారణం ఇదే..
తను చనిపోయే వరకు తన కొడుకైనా.. కూతురైనా.. తన వద్ద ఉండి చివరి మజిలీ దాటించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు.
By: Tupaki Desk | 11 Aug 2025 5:00 PM ISTసృష్టిలో కల్తి కానిది తల్లిప్రేమ ఒక్కటే. అమ్మ ప్రేమకు ఆద్యాంతాలు లేవు. తన సంతానం తనను పట్టించుకోకున్నా.. తల్లి మాత్రం తన కూతురు, కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చెప్పుకోలేని సమస్య ఎదురైతే తప్ప తల్లి తన పిల్లలను విడిచిపెట్టి ఉండలేదు. తన పిల్లలను కాపాడుకునేందుకు ఎంతదూరానికైనా వెళ్తుంది.., ఎవరితోనైనా కొట్లాడుతుంది. కట్టుకున్నోడిని చివరికి తనను కన్నోళ్లను కూడా తను కన్నోళ్ల కోసం దూరం చేసుకుంటుంది. తల్లి ప్రేమను కొలిచేందుకు కొలమానాలు ఉంటాయా..? తండ్రి కుటుంబాన్ని నడిపిస్తున్నా.. సంతానానికి వండి పెట్టి పాలన బాధ్యతలు చూసుకునేది అమ్మే. అందుకే తల్లికి పిల్లల అటాచ్ ఎక్కువగా ఉంటుంది.
చివరి మజిలీ వరకు ఉంటారని ఆశ..
తను చనిపోయే వరకు తన కొడుకైనా.. కూతురైనా.. తన వద్ద ఉండి చివరి మజిలీ దాటించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అందుకే తన పిల్లలను చిన్నతనం నుంచి వాళ్లు ప్రయోజకులు అయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రయోజకులుగా మారిన పిల్లల వద్ద ఉంటూ మనుమళ్లు, మనుమరాళ్లతో గడుపుతూ తమ శేష జీవితం కొనసాగిస్తారు. ఇవన్నీ ప్రకృతి పరంగా జరిగేవే.. కానీ కొన్ని కొన్ని జీవిత చరమాంకంలో కన్నీళ్లను తెచ్చిపెడతాయి. తన కొడుకు కోసం ఒక తల్లి పడే ఆవేదన గురించి తెలుసుకుంటే కన్నీళ్లు కలుగకమానదు.
కొడుకును కోర్టులో చూసి షాక్..
తూర్పు చైనాలో జెఝియాంగ్ కు ప్రావిన్స్ కు చెందిన వ్యక్తి లిన్ పై తన బిజినెస్ పార్ట్నర్ కేసు వేశాడు. ఈ కేసులో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడాలని పట్టుబట్టింది తల్లి. లిన్ కు లాయర్ ఉన్నా కూడా కొడుకు కేసును తానే వాదిస్తానని 90 ఏళ్ల వయస్సులో న్యాయ పుస్తకాలను తిరగేస్తుంది. న్యాయ కోవిదులను కలిసి సూచనలు తీసుకుంటుంది. లైబ్రరీల్లో పుస్తకాలను, గత కోర్టుల తీర్పులను పరిశీలిస్తుంది. ఆరోగ్యం గురించి ఆలోచించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నా.. దాన్ని పట్టించుకోవడం లేదు. మొదటి సారి కోర్టు హాల్ కు సంకెళ్లతో వచ్చిన కొడుకను చూసి కిందపడిపోయింది. హాస్పిటల్ కు తీసుకెళ్లాలని న్యాయమూర్తి సూచించానా.. వారించి తనకు ఏం కాలేదని తన కొడుకును చూసి ఆందోళనకు గురైనట్లు చెప్పుకచ్చింది. 2003 నుంచి ఇప్పటికీ ఆమె తన కొడుకును విడిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది.
