Begin typing your search above and press return to search.

వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు... ఎంపీ మోపిదేవి కీలక వ్యాఖ్యలు!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా అనంతరం అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Dec 2023 6:59 AM GMT
వైసీపీ ఇన్  ఛార్జ్  ల మార్పు... ఎంపీ మోపిదేవి కీలక వ్యాఖ్యలు!
X

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా అనంతరం అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. సర్వేల సూచనలు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల సలహాలు, పలు సమీకరణాల వల్ల ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నరే తప్ప.. అందులో పూర్తిగా విభేదించడానికి ఏమీ ఉండకూడదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పలు నియోజకవర్గాల్లో కార్యకర్తలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఇన్ ఛార్జ్ లను మార్చడంతో పలువురు కార్యకర్తలు ఆవేశకావేశకాలకు పోవడం, మరికొన్ని చోట్ల పార్టీకి రాజీనామాలు చేయడం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ ఇన్ ఛార్జ్ లను మార్చిన నియోజకవర్గాల్లో ఒకటైన బాపట్ల జిల్లా రేపల్లెలోనూ ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఎంపీ మోపిదేవి వర్గీయులు నిరసనలకు దిగుతున్నారు. ఈ సమయంలో మోపిదేవి స్పందించారు.

అవును... తాజాగా జరుగుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పులు, ఆ విషయాలపై అలుగుతున్న పలువురు కార్యకర్తలు, ప్రధానంగా రేపల్లెలో ఇటీవల జరిగిన తాజా పరిణామాలపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఇందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టాన తీసుకున్న నిర్ణయానికి తాను, తన కార్యకర్తలు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇదే సమయంలో తాను పార్టీమారుతున్నట్లు వస్తున్న వార్తలనూ ఖండించారు!

ఈ సందర్భంగా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా తాము స్వాగతిస్తామని తెలిపిన మోపిదేవి... అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తనతో పాటు తన అనుచరులు, నాయకులూ కట్టుబడి ఉంటారని తెలిపారు. ఈ సమయంలో... తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను అంత క్రమశిక్షణ లేని వ్యక్తిని కాదని.. ఈ విషయంలో మరోమాట లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అభ్యర్థిని మార్చినంతమాత్రాన్న ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేదని మాత్రమే భావించాల్సిన అవసరం లేదని.. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉంటాయని.. వాటి వలన కూడా అధిష్టానం కొన్ని సందర్భాల్లో అభ్యర్థిని మారుస్తారని మోపిదేవి వ్యాఖ్యానించారు. అలాంటి సమయాల్లో కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం సహజమని తెలిపారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు.

కాగా... ఇన్ ఛార్జ్ లను మార్చే విషయంలో రేపల్లెలోనూ ఎంపీ మోపిదేవి వర్గీయులు నిరసనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని మత్సకార సంఘాలు కలిశాయి. ఇందులో భాగంగా... మోపిదేవికి ఎట్టి పరిస్దితుల్లోనూ ఈసారి టికెట్ ఇవ్వాల్సిందేనని తెలిపాయి. దీనిపై స్పందించిన సజ్జల... సీఎం జగన్ తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు.

ఈ సమయంలో తాజాగా మోపిదేవితో అధిష్టానం ఫోన్ లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అధిష్టాణం తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల శ్రేయస్సు కంటే పార్టీ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకునే ఉంటాయనే విషయం స్పష్టం గా చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన కాస్త మెత్తబడ్డారని.. అందులో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.