Begin typing your search above and press return to search.

వానర యుద్ధం అంటే ఇదేనా... వీడియో వైరల్!

ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న జనాలను టెన్షన్ పెడుతూ తాజాగా అక్కడ జరిగిన చిన్న సైజు వానర యుద్ధం ఇప్పుడు నెట్టింట వైరల్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 March 2024 12:25 PM GMT
వానర యుద్ధం అంటే ఇదేనా... వీడియో వైరల్!
X

వానర యుద్ధం గురించి వినడం.. టీవీల్లో చూడటం.. పుస్తకాల్లో చదవడమే తప్ప లైవ్ లో చూసే అవకాశం లేదు! అయితే థాయిలాండ్ వెళ్తే మాత్రం ఊహించని సంఖ్యలో వానరాలు రెండు బ్యాచ్ లుగా విడిపోయి చిన్న సైజు యుద్ధం చేసుకోవడం అక్కడ సర్వ సాధారణమైన విషయంగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న జనాలను టెన్షన్ పెడుతూ తాజాగా అక్కడ జరిగిన చిన్న సైజు వానర యుద్ధం ఇప్పుడు నెట్టింట వైరల్ టాపిక్ గా మారింది.

అవును... థాయిలాండ్ లో జరిగిన ఒక విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌ కు ఉత్తరాన 90 మైళ్ల దూరంలో ఉన్న లోప్ బురీ అనే పట్టణంలో కోతుల జనాభా చాలా ఎక్కువంట. అవి సుమారు వెయ్యి పైనే ఉంటాయని చెబుతుంటారు. ఉంటే ఉన్నాయి అనుకుంటే పొరపాటే... అవన్నీ ఒకేసారి రోడ్లపైకి వచ్చేస్తుంటాయంట. వస్తే వచ్చాయి అనుకున్నా పొరపాటే... వచ్చాక రెండు వర్గాలుగా విడిపోయి ఫైటింగ్ మొదలుపెడతాయి!

దీంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా లంక అయిపోద్దని.. అక్కడ చిన్న సైజు వానరయుద్ధం దర్శనమిస్తుందని.. ఇది అక్కడకు వచ్చిన టూరిస్టులకు అతిపెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారంట. ఇలా వందల సంఖ్యలో వానర సైన్యం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో... హెవీగా ట్రాఫిక్ జాం అవ్వడంతో పాటు... వాహదారులు తీవ్ర ఆందోళన చెందుతుంటారంట.

ఇదే సమయంలో... ఇక్కడ కోతులను అరికట్టేందుకు పోలీసు డిపార్ట్ మెంట్ ప్రతేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుందంటే... అక్కడ వానరాల ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. పోలీస్ మేజర్ జనరల్ అపిరాక్ వెచ్ కాంచన మాట్లాడుతూ... కోతుల నుంచి ఎదురయ్యే ప్రమాదం గురించి తనకు తెలుసని.. అయితే పర్యాటకులకు, స్థానికులకు ముప్పు కలిగించడం ప్రారంభించాయని చెబుతున్నారు.

ఇదే క్రమంలో... అక్కడ కోతులను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్న వెచ్ కాంచన... స్లింగ్ షాట్ లను ఉపయోగించి కోతులను తరుముతున్నట్లు చెబుతున్నారు! ఇదే సమయంలో... వస్తువులను దొంగిలించకుండా.. ధ్వంసం చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత కూడా పోలీస్ యూనిట్ కు ఉందని వెల్లడించారు. ఏది ఏమైనా... ఇలా వందల సంఖ్యలో కోతులు ఇలా రోడ్లపైకి వచ్చి ముఠా తగాదాలకు పాల్పడటం మాత్రం వైరల్ గా మారింది.