Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లో కుంభమేళా సెన్సేషన్ 'వైరల్ గర్ల్' మోనాలిసా.. పాటతో రీఎంట్రీ!

2025 మహా కుంభమేళాకు సుమారు 60కోట్ల మంది భక్తులు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక సంగమంలో ఒక సాధారణమైన పూసలమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   14 May 2025 8:30 AM
మళ్లీ వార్తల్లో కుంభమేళా సెన్సేషన్ వైరల్ గర్ల్ మోనాలిసా.. పాటతో రీఎంట్రీ!
X

2025 మహా కుంభమేళాకు సుమారు 60కోట్ల మంది భక్తులు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక సంగమంలో ఒక సాధారణమైన పూసలమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. తన కళ్ళలోని మెరుపుతో, చిరునవ్వుతో సోషల్ మీడియాను ఊపేసింది. ఆమె ఎవరో కాదు.. 'వైరల్ గర్ల్' మోనాలిసా! కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ కనిపించిన ఈ యువతి ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె అందానికి ముగ్ధులైన నెటిజన్లు ఆమె ఫోటోలు, వీడియోలను విపరీతంగా షేర్ చేశారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఆ సినిమా ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా, మోనాలిసా ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి ఆమె ఒక ప్రత్యేకమైన పాటలో నటిస్తోంది. ఈ పాట షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మోనాలిసా స్వయంగా ఈ షూటింగ్ అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. షూటింగ్ చాలా సాఫీగా, ఆహ్లాదకరంగా జరిగిందని ఆమె చెప్పడం విశేషం. కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న మోనాలిసా, ఈ పాట కోసం మళ్లీ వెలుగులోకి రావడంతో ఆమె తాజా వీడియోలు, ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా మోనాలిసా ఒక సినిమా సెట్‌లో ఉండగా, ఒక కెమెరామన్ ఆమెతో ఫోటో దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు అనతికాలంలోనే 2.7 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. దాదాపు 50 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం మోనాలిసా సినిమా గురించి ఆరా తీస్తున్నారు. "కుంభమేళాలో చూసిన మోనాలిసాకు, ఇప్పుడు చూస్తున్న మోనాలిసాకు మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. ఆమె స్టైల్ పూర్తిగా మారిపోయింది" అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమెను ఒక సెలబ్రిటీలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే, కుంభమేళా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక సాధారణ అమ్మాయి ఒక్కసారిగా వెలుగులోకి రావడం నిజంగా అద్భుతమని కొందరు అంటున్నారు. మోనాలిసా వెండితెరపై ఎలా మెరుస్తుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాట విడుదలైన తర్వాత ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.