మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నారా? ఎవరు చెబుతున్నారు ఇదంతా?
ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని.. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న కథనాలు తప్పుగా ఇరాన్ ప్రభుత్వం ఖండిస్తుంది.
By: Garuda Media | 13 March 2026 11:09 AM ISTఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్దం తొలిరోజునే ఇరాన్ మాజీ సుప్రీం లీడర ఆయతుల్లా అలీ ఖమేనీ హతం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇరాన్ లోని 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ ఆయన్ను సుప్రీం లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేతికి అధికారిక పగ్గాలు రాక ముందే ఇరాన్ రాజకీయాల్లో.. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కొందరు.. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అందిస్తున్న కథనాలను.. మన దేశంలోని పలు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. మరి.. ఈ వాదనలో నిజం ఎంత? అసలు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని చెప్పటానికి ఎలా అయితే ఆధారం కావాలో.. అదే విధంగా కోమాలో ఉన్నారని చెప్పేందుకు పక్కా సాక్ష్యం కావాలి కదా? అన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా ఐదు అత్యంత విశ్వసనీయ మీడియా సంస్థలు మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం గురించి ఏం చెబుతున్నాయి? అన్నది ఒక ప్రశ్న అయితే.. పశ్చిమాసియాలో టాప్ 5 మీడియా సంస్థలు ఏం చెబుతున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికకరంగా మారింది.
ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని.. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న కథనాలు తప్పుగా ఇరాన్ ప్రభుత్వం ఖండిస్తుంది. ఆయన సురక్షితంగా ఉన్నట్లుగా ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆయనకు సంబంధించిన తాజా వీడియోలు ఏ ఒక్కటి బయటకు రాని పరిస్థితి. ఇదిలా ఉండగా మార్చి 12న మొజ్తాబా ఖమేనీ పేరుతో మొదటి అధికారిక ప్రకటన విడుదలైంది. అందులో ఆయన హోర్ముజ్ జలసంధించిన మూసి వేస్తామని.. శత్రువులపై ప్రతీకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి వీడియో లేకపోవటం గమనార్హం. ఇరాన్ అధ్యక్షుడుకుమారుడు.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న యూసుఫ్ పెజెష్కియాన్ మాత్రం మొజ్తాబా ఖమేనీని సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లు తన టెలిగ్రామ్ కు
ఈ నేపథ్యంలో ప్రధాన మీడియా సంస్థలు ఏం చెబుతున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇందులో భాగంగా ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు ఎలా ఉన్నాయి? అన్నది చూస్తే..
రాయిటర్స్
మొజ్తాబా ఖమేనీ కి స్వల్ప గాయాలు అయ్యాయి. తన విధులు నిర్వర్తిస్తున్నారని ఇరాన్ అధికారి మాకు వెల్లడించారు. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఆయన గాయపడ్డారు. అందుకే ఆయన బహిరంగంగా కనిపించటం లేదని ఇజ్రాయెల్ నిగా వర్గాలు భావిస్తున్నాయి.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలను రాయిటర్స్ స్వతంత్రంగా నిర్దారించకున్నా.. ఇరాన్ ప్రభుత్వ టీవీ ‘జన్ బాజ్’ (యుద్దంలో గాయపడిన వీరుడు) అని అభివర్ణించిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేసింది.
బీబీసీ
మొజ్తాబా ఖమేనీకి గాయాలు అయ్యాయనే వార్తలు ఉన్నా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కచ్ఛితమైన వివరాలు బయటకు రావటం లేదు. సుప్రీం లీడర్ గా ప్రకటన విడుదలైన తర్వాత ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు.
న్యూయార్క్ టైమ్స్
మొజ్తాబా ఖమేనీ కాళ్లకు గాయాలు అయ్యాయి. అయితే.. ఆయన స్ప్రహలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన సురక్షిత ప్రాంతంలో ఉండి చికిత్స పొందుతున్నారు.
సీబీఎస్ న్యూస్
ఆయన కోమాలో వెళ్లారనే వార్తల్ని ఇరాన్ అధికారులు ఖండిస్తున్నారు. ఆయన ప్రకటనను టీవీలో న్యూస్ రీడర్ చదవటమే తప్పించి.. ప్రత్యక్షంగా కనిపించకపోవటం సందేహాలు ఇంకా తొలగిపోలేదు.
అల్ జజీరా
ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడి కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉండి పాలనను పర్యవేక్షిస్తున్నారు.
అల్ అరేబియా
మొజ్తాబీ ఖమేనీ సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు కొడుకు పేర్కొన్నారు. కాళ్లకు గాయాలయ్యాయి.. కానీ ఒక సురక్షిత ప్రాంతంలో ఉండి పాలన సాగిస్తున్నారు.
ది నేషనల్ (యూఏఈ)
ఇజ్రాయెల్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆయన కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సైప్రస్ లోని ఇరాన్ రాయబారి చెప్పినట్లుగా వార్తలను ప్రసారం చేసింది.
హారెట్జ్
ఇజ్రాయెల్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అందుకే ప్రజల ముందుకు రావటం లేదు.
టిఆర్ టి వరల్డ్ (టర్కీ)
ఇరాన్ ప్రభుత్వం మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వివరణ ఇచ్చింది.ఆయన క్షేమంగా ఉన్నారు. శత్రువుల దాడుల నుంచి సురక్షితంగా ఉన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఒక కాలును కోల్పోయే అవకాశం ఉందన్న ఊహాగానాల్ని ప్రస్తావించింది. ఆయన కోమాలో లేరని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన ఒక రహస్య బంకర్ లేదా సురక్షిత ప్రాంతం నుంచి పాలనను పర్యవేక్షిస్తున్నారు.
