Begin typing your search above and press return to search.

ఇష్టంగానే.. అయిష్టంగా.. ప్ర‌ధాని మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న‌..!

కేవ‌లం ఒకే ఒక గంట మాత్ర‌మే ఏపీకి కేటా యించారు. దీంతో మోడీకి ఏపీకి రావ‌డానికి ఇష్టం లేదా? అనేది చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   16 March 2024 8:03 AM GMT
ఇష్టంగానే.. అయిష్టంగా.. ప్ర‌ధాని మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న‌..!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం ఏపీలో అడుగు పెట్ట‌నున్నారు. నేరుగా ఢిల్లీ నుంచే ఆయ‌న ప‌ల్నాడు జిల్లాకు రానున్నారు. ఇక్క‌డ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మి నిర్వ‌హిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌.. 'ప్ర‌జాగ‌ళం'లో పాల్గొన‌నున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న వెనుక ప్ర‌ధానికి ఇష్టం ఉందా? లేక మొక్కు బ‌డిగా వ‌స్తున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి బీజేపీకి ఏపీలో పొత్తులు పెట్టుకోవాల‌ని భావించి న వారిలో మోడీ లేరు. కేవ‌లం కేంద్ర మంత్రి అమిత్ షా.. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా మాత్ర‌మే ఉన్నా రు.

వీరు మిన‌హా ఎవ‌రికీ ఏపీలో పొత్తులు పెట్టుకోవాల‌ని లేదు. దీంతో వారి ప్రోద్బ‌లం మేర‌కు.. మోడీ ఏపీలో నిర్వ‌హిస్తున్న తొలి ఉమ్మ‌డి భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా బ‌లాన్నిస్తున్న విష‌యం ఏంటంటే..ఆయ‌న ఎక్క‌డైనా ప‌ర్య‌టిస్తుంటే.. ముందుగానే ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతారు. తాను వ‌స్తున్నాన‌ని కూడా వెల్ల‌డిస్తారు. రాష్ట్ర ప‌రిస్థితుల‌ను కూడా ప్ర‌స్తావిస్తారు. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని రెండు రోజుల ముందే.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.

తాను వ‌స్తున్నాన‌ని, తెలంగాణ అభివృద్ధికి అంద‌రితోనూ క‌లిసి ప‌నిచేస్తాన‌ని కూడా వెల్ల‌డించారు. కానీ, ఏపీలో నిర్వ‌హిస్తున్న కీల‌క‌మైన స‌భ విష‌యంలో ప్ర‌ధాని ఎలాంటి స్పంద‌నా లేకుండామౌనంగా ఉన్నా రు. పైగా.. ఆయ‌న నేరుగా స‌భ‌కు వ‌చ్చి వెళ్లిపోనున్నారు త‌ప్ప‌.. పార్టీ నాయ‌కుల‌తో కానీ.. పొత్తు పార్టీల నేత‌ల‌తోకానీ, ఆయ‌న ఎలాంటి భేటీ ఏర్పాటు చేసుకోలేదు. కేవ‌లం ఒకే ఒక గంట మాత్ర‌మే ఏపీకి కేటా యించారు. దీంతో మోడీకి ఏపీకి రావ‌డానికి ఇష్టం లేదా? అనేది చ‌ర్చ‌గా మారింది.

అయితే.. మోడీ రాక‌తో పొత్తు పార్టీల‌కు బ‌లం చేకూరుతుంద‌నే చ‌ర్చ కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏం చెప్పినా.. ప్ర‌ధాని మోడీ త‌న ప్ర‌భుత్వ విష‌యాలు, విజ‌యాల‌నే ప్ర‌ధానంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే.. మోడీ వ్య‌వ‌హారం ఏపీపై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేకుండా పోవడం గ‌మ‌నార్హం. ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌నే స్వ‌యంగా ఒక‌టికి రెండు సార్లు ప‌ర్య‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.