Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్‌: గ‌గ‌న త‌లం ఆపేశారు.. స‌రిహ‌ద్దుల్లో ల‌క్ష మంది సైన్యం!

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ పోటీల్లో భార‌త్‌, ఆస్ట్రేలి యా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Nov 2023 9:06 AM GMT
వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్‌: గ‌గ‌న త‌లం ఆపేశారు.. స‌రిహ‌ద్దుల్లో ల‌క్ష మంది సైన్యం!
X

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ పోటీల్లో భార‌త్‌, ఆస్ట్రేలి యా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా ఈ ద‌ఫా ఈ మ్యాచ్‌కు చాలా క్రేజ్ పెరిగింది. పెరుగుతున్న మాధ్యమాలు..యువ‌త నేప‌థ్యంలో వ‌న్డే మ్యాచ్‌కు అంతే రేంజ్‌లో ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున న‌రేంద్ర మోడీ స్టేడియంకు ప్ర‌జ‌లు పోటెత్తారు.

ఇక‌, స్టేడియంకు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రివ‌ర్గం.. స‌హా విదేశీ రాయ‌బారులు, ప్రముఖులు కూడా హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్టేడియం స‌హా.. గుజ‌రాత్ తీరం వెంబ‌డి ఉన్న స‌రిహ‌ద్దుల్లో కేంద్ర ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది. అదేస‌మ‌యంలో గ‌గ‌న మార్గంలోనూ రాక‌పోక‌లు నిషేధించిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. మ్యాచ్ జ‌రిగే ఆరు నుంచి 8 గంట‌ల పాటు అహ్మ‌దాబాద్ స్టేడియం పైనుంచి వెళ్లే విమానాల‌ను దారి మ‌ళ్లించారు.

ఇక‌, స్టేడియం చుట్టూ.. గుజ‌రాత్ పోలీసులు క‌మ్మేశారు. సుమారు 10 వేల మంది పోలీసులు.. ఒక్క స్టేడి యం చుట్టూనే కాప‌లాకాస్తున్నారు. అణువ‌ణువునూ నిశితంగా గాలిస్తున్నారు. ఉగ్ర వాద బెదిరింపులు, దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న హెచ్చ‌రికల నేప‌థ్యంలో ఈ భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్టు గుజ‌రాత్ డీజీపీ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. పాకిస్థాన్ స‌రిహ‌ద్దు వెంబ‌డి.. ఏకంగా ల‌క్ష మంది సైనికుల‌తో ప‌హారా కాస్తున్నారు. గ‌త రెండు రోజులుగా 70 వేల మంది ఉండ‌గా.. ఈ సంఖ్య‌ను మ‌రో 30 వేలు పెంచారు. మొత్తానికి.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ పోటీల‌కు క‌నీవినీ ఎరుగ‌ని భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం.