Begin typing your search above and press return to search.

అనుకోని అథిదిగా అక్కడ మోడీ....!

దాంతో ఈ దేశానికి చాయ్ వాలా ప్రధాని అయ్యారని ఆయన చెప్పుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 2:03 PM GMT
అనుకోని అథిదిగా అక్కడ మోడీ....!
X

మోడీని చాయ్ వాలా అని పిలుస్తారు. ఆయన కుటుంబీకులంతా చాయ్ దుకాణం నడిపేవారు. మోడీ కూడా చిన్నపుడు ఇదే వృత్తిలో కొన్నాళ్ళు ఉన్నారు. దాంతో ఈ దేశానికి చాయ్ వాలా ప్రధాని అయ్యారని ఆయన చెప్పుకున్నారు. బీజేపీ కూడా గొప్పగా అనేక సందర్భాలలో చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే మోడీ చాయ్ బంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఈ మధ్య గుజరాత్ సీఎం గా మూడు సార్లు గెలిచారు. అలాగే రెండు సార్లు దేశానికి ప్రధానిగా కూడా చేశారు. సామాన్యులతో కలసి చాయ్ తాగడం మోడీకి ఎంతో ఇష్టం. అది మరోసారి రుజువు అయింది.

అయోధ్యలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని అనూహ్యంగా ఒక సామాన్యుల ఇంట్లోకి ప్రవేశించారు. అనుకోని అతిధిగా వారి ఇంట్లో మోడీ ప్రత్యక్షం అయ్యారు. ఇది ఎంతో ఆసక్తికరమైన సన్నివేశంగా చోటు చేసుకుంది,.

అలా ఓ సామాన్యురాలి ఇంటికి పీఎం మోదీ వెళ్ళారు. ఆమె పేరు మీరా. అలా మీరా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా మోడీ కాసేపు సంభాషించారు. వారి ఇంట చాయ్ కూడా తాగారు. అయితే ఆమె ఇంటికే మోదీ ఎందుకు వెళ్లారంటే మాత్రం దాని వెనుక ఓ ప్రత్యేకత ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దేశంలో ఇప్పటివరకు 10 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. దాని మీద ప్రచారం కూడా పెద్ద ఎత్తున బీజేపీ చేస్తోంది. నరేంద్ర మోడీ కూడా పలు సభలలో తమ ప్రభుత్వం పేదలకు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఎబుతూ వస్తున్నారు ఇపుడు కూడా ఆయన ఒక సామాన్య కుటుంబం వద్దకు వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి వారి నుంచే తెలుసుకున్నారు.

అయినా ఒక సామాన్య కుటుంబం ఇంటికి దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ వెళ్లడం మాత్రం వేడెక్కించే న్యూస్ గానే ఉంది. దటీజ్ మోడీ అని అందుకే అంటారు. అయోధ్య పర్యటనలో ఈ విషయం ఉందో లేదో తెలియదు కానీ ఇలాంటి అనూహ్య సందర్భాలను సంఘటనలను సృష్టించడంలో మాత్రం మోడీకి సరిసాటి ఎవరూ లేరు అనే అంటారు

ఆయన్ని ఈ విషయంలో ఢీ కొట్టే వారు కూడా లేరు మోడీ ఒక పేద వారి ఇంట అడుగు పెట్టారు అంటే ప్రధాని పేదలకు ఎంత చేరువ అన్న సందేశం చాలా సులువుగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ దేశంలో నూటికి అరవై శాతం నిరుపేదలు ఉన్నారు. ఎన్నికల సమయంలో గంభీర ఉపన్యాసాలు కాదు ఇలాంటివి కూడా చేయడం మోడీకి మాత్రమే తెలిసిన విద్య. అందుకే ఆయన జోరును ఎవరూ ఆపలేరు అని అంటున్నారు.