Begin typing your search above and press return to search.

మోడీ వరస హెచ్చరికలు...అంతా వ్యూహాత్మకమా ?

ఇదిలా ఉంటే మోడీ ఇలా వరస హెచ్చరికలు చేయడం ఎందుకోసం అన్న చర్చ వస్తోంది.

By:  Tupaki Desk   |   27 April 2025 10:19 PM IST
Pm Modi Pahalgam Terror Attack Strategy
X

కాశ్మీర్ లోని పహల్గామ్‌ ఉగ్రదాడి విషయంలో మొదట నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ తరువాత బీహార్ లో జరిగిన ఒక సభలో ఘాటుగా స్పందించారు. ఇపుడు చూస్తే ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పహల్గామ్‌ దాడిని ప్రస్తావిస్తూ చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చరు.

ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందని మోడీ అన్నారు. కాశ్మీర్ మీద ఉగ్రదాడిపై అంతా అగ్రహంతో రగిలిపోతున్నారని అన్నారు. అంతే కాదు ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇంతటికష్టకాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మోడీ ఇలా వరస హెచ్చరికలు చేయడం ఎందుకోసం అన్న చర్చ వస్తోంది. ఆయన అత్యంత బలవంతుడు. అనుకుంటే ఉగ్రదాడి జరిగిన మరుక్షణాన్నే పాక్ మీద దాడి చేయవచ్చు. లేదా మౌనంగానే ఉంటూ సరైన సమయం చూసి శతృవు మీద ఎటాక్ చేయవచ్చు. అంతే కాదు దాయాది పీచమణచేందుకు బహుముఖీయమైన అస్త్రాలతో ఒక్కసారిగా మీద పడవచ్చు.

ఇలా ఎన్నో చేయవచ్చు. కానీ మోడీ మాత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రతీ సందర్భంలో పాక్ కి బాగా వినిపించేలా సీరియస్ వార్నింగ్స్ తో రీసౌండ్ చేస్తున్నారు. ఎందుకిలా అంటే అంతా వ్యూహాత్మకం అని అని చెబుతున్నారు. ఉగ్ర దాడి తరువాత పాక్ సైన్యం అప్రమత్తం అయింది. ఆ పాలకులు సరిహద్దుల వద్ద భద్రత మోహరించి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఇక భారత్ మీద ఉగ్ర దాడి జరగడంతో ప్రపంచ దేశాలు కూడా సానుభూతి చూపిస్తూ భారత్ కి మద్దతుగానే మాట్లాడుతున్నాయి. ఇలా ప్రపంచంలో ఇపుడు అనుకూలత భారత్ కి ఉంది. అయితే కాలం గడచే కొద్దీ అది కొంత చల్లబడవచ్చు. అందుకే వేడి మీద ఉంచేందుకే మోడీ ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే పాక్ తెంపరితనం కూడా ప్రపంచం అంతా చూసేలాగానే మోడీ ఈ ప్రకటనలు చేస్తున్నారు. పాక్ అసలే రెచ్చగొట్టుడు తన నైజం అని చాటి చెప్పుకుంటుంది. ఇపుడు కూడా అలాంటి పనులే చేస్తోంది. అణు బాంబులు అంటోంది. భారత్ మీదనే మా దాడి అని అవాకులూ చవాకులూ పేలుతోంది.

ఇవన్నీ కూడా పాక్ మీద భారత్ ఎంతలా దాడి చేసినా తప్పు లేదని తటస్థులకు అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక దేశంలో చూస్తే ఈ నెల 22న ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి దేశమంతా వేడెక్కి ఉంది. ప్రతీకారం తీర్చుకోమని గట్టిగా కోరుతోంది.

దాంతో ప్రజలకు మద్దతుగా ఉంటూ వారి వాయిస్ నే తన నోట మోడీ మళ్ళీ వినిపించడం ద్వారా వారికి ఎంతో స్వాంతన కలిగిస్తున్నారు. ఇక పాక్ మీద గట్టి ఆపరేషన్ నే రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. ఆషామాషీగా ఈసారి దాడి ఉండదని అంటున్నారు.

పాక్ కి శాశ్వతంగా గుణపాఠం నేర్పేలా ఉంటుందని చెబుతున్నారు. అందుకోసమే కొంత ఆలస్యం అయినా సరైన రిజల్ట్ కోసమే భారత్ చూస్తోంది అని అంటున్నారు. ఈ లోగా జనాలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ లో ఉంచడం కోసం వ్యూహాతమకంగానే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు అయితే పాక్ తో సహా అందరికీ తెలుసు.

భారత్ ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అని. అది ఏ రూపంలో ఉంటుంది అన్నదే ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే అదే సస్పెన్స్. అక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. ఇక పాక్ మీద దాడి అంటే త్వరలో జరగవచ్చు. లేదా కొంతకాలం ఆగి అయినా జరగవచ్చు. ఒక సుదీర్ఘమైన ప్రణాళిక కోసమే ఇదంతా జరుగుతోంది అని అంటున్నారు. సో పాక్ నడ్డి విరగడం ఖాయం. అది ఎపుడు అంటే పాక్ కోరినపుడు కాదు, పైగా పాక్ యుద్ధ పిపాసతో రగులుతున్న ఈ సమయంలో అంతకంటే కాదు అని అంటున్నారు. మరి ఎపుడు అంటే వెయిట్ అండ్ సీ.