చరిత్రలో నిలిచిపోయేలా మోడీ పక్కా ప్లాన్ !
ఎవరైనా సాధించలేనిది, అది అసాధ్యమని అంతా అనుకున్నది ఎవరో ఒకరు ఎపుడో ఒకపుడు సాధిస్తే వారిని కచ్చితంగా చరిత్ర సృష్టించారు అని అంటారు.
By: Tupaki Desk | 12 May 2025 10:19 AM ISTఎవరైనా సాధించలేనిది, అది అసాధ్యమని అంతా అనుకున్నది ఎవరో ఒకరు ఎపుడో ఒకపుడు సాధిస్తే వారిని కచ్చితంగా చరిత్ర సృష్టించారు అని అంటారు. అలా చూస్తే కనుక నరేంద్ర మోడీ ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ఈ రోజు అతి పెద్ద దేశానికి మూడు సార్లు ప్రధానిగా ఉన్నారు అంటే అది మోడీకే సాధ్యం.
అంతే కాదు ఆయన తిరిగినన్ని దేశాలు ఎవరూ ఒక దేశ ప్రధాని హోదాలో తిరగలేదు. అంతే కాదు ఆయన ఇమేజ్ విశ్వవ్యాప్తంగా ఉంది. ఆయన అందరికీ బంధువుగా మారిపోయారు. అంతమాత్రం చేత మెతకగా ఉండరు. దాయాది పాక్ కి ఆయన కంట్లో నలుసుగా ఉంటారు. ఆయన వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఆయన చాతుర్యం కూడా ఎవరికీ ఒక పట్టాన బోధపడేది కాదు, అనుసరించడానికి వీలు పడనిది.
ఇదిలా ఉంటే ఒకే ఒక్క పాక్ ఫోన్ కాల్ తో కాల్పుల విరమణ భారత్ ఎలా చేసింది అన్నది అందరిలో ఒక ధర్మ సందేహం ఉంది. పాక్ మీద పూర్తిగా పైచేయి సాధిస్తూ వచ్చిన భారత్ కధ మంచి రసపట్టులో ఉండగా క్లైమాక్స్ లో ఇంకా ఆసక్తిని పెంచుతూండగా ఉన్నట్లుంది ఎందుకు మిడిల్ డ్రాప్ చేసారు అన్నది కూడా ఎవరి బుర్రలకు ఏ మాత్రం తోచనిదే.
అయితే మోడీ ఏమి చేసినా దానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ ని పక్కాగా నిర్వహించి ఉగ్ర మూకల కేంద్రాలను ధ్వంసం చేసిన తర్వాత భారత్ రిలాక్స్ కాలేదు. పాక్ మూడ్ ని గమనిస్తూ ఉంది. పాక్ ప్రతీకారం చేస్తుందని తెలుసు. దానికి తగిన విధంగా సరకూ సరంజామాతో మొత్తం సిద్ధంగా ఉంది.
అనుకున్నట్లుగానే పాక్ రంగంలోకి దిగింది. భారత్ ఉచ్చులో చిక్కుకుంది. యుద్ధం డైరెక్ట్ గా చేయకుండా పాక్ మూడు రోజులకే చతికిలపడి పోయింది. భారత్ తన వద్ద ఉన్న ఆయుధాల గారంలో కనీసం పదో వంతు కూడా తీయకుండాన పాక్ నేలకరచేసింది. అలాంటి పాక్ ని ఇంకా కొట్టినా ప్రయోజనం లేదు. అందుకే భారత్ కాల్పుల విరమణ అంటే ఓకే అంది. చర్చలకు సరేనంది.
ఇదంతా పాక్ ని బేలను చేసి డీలా చేసి తమ ముందుకు తెచ్చిన చాణక్య వ్యూహం ఇపుడు పాక్ భారత్ చెప్పినట్లుగా వినాలి. లేకపోతే ఆ దేశం బదనాం అవుతుంది. అందుకే మోడీ పీఓకే కావాలని అంటున్నారు. అది ఒక్కటి చాలు అన్నదే భారత్ డిమాండ్.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనంలో ఉంటే కనుక పాక్ ఇక ముక్క చెక్కలు అయినట్లే ఇక పాక్ ఆట కట్టేసినట్టే. మరి చర్చలలో పాక్ ఆ పని చేస్తుందా ఒప్పుకుంటుందా అన్నదే కదా ప్రశ్న. ఒప్పుకుంటే పాక్ ఇంకా నాశనం కాకుండా కొనప్రాణంతో బతుకుతుంది కాకపోతే భారత్ తన వద్ద ఉన్న మరో పది శాతం ఆయుధాలను తీస్తే చాలు దాయాది పూర్తిగా మటాష్ అవుతుంది.
ఇదంతా అగ్ర రాజ్యం అమెరికా కూడా అమోదించేలాగానే జరిగినట్లుగా కూడా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తన పెద్దరికం అని అనుకోవచ్చు కానీ భారత్ వ్యూహం ఇదే అని అంటున్నారు. పాక్ కి ముకుతాడు వేయడం అంటే ఇదే అంటున్నారు. పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఇస్తే ఓకే లేకపోతే మాత్రం ముందే చెప్పినట్లుగా ఉగ్ర నీడ తమ మీద పడినా భరతం పడతామని యుద్ధమే ని భారత్ చెబుతోంది. దాంతో ఇపుడు పాక్ కి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా సీన్ ఉంది.
ఇపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి చెప్పుకుంటే 1971లో మొత్తం పాక్ ని ఓడించి గడడలాడించినా కూడా ఇందిరాగాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తీసుకోలేదు. అది ఒక చారిత్రాత్మక తప్పుగా మిగిలిపోయింది. ఇపుడు మోడీ కనుక దానిని సాధిస్తే కనుక ఆయన చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరుని లిఖించుకున్న వారు అవుతారు. మొత్తానికి పక్కా ప్లాన్ తోనే మోడీ ఉన్నారని అంటున్నారు.
