మోడీకి 24 దేశాల అత్యున్నత పురస్కారాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి గౌరవాల జల్లు కురుస్తోంది.
By: Tupaki Desk | 3 July 2025 3:46 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి గౌరవాల జల్లు కురుస్తోంది. ఇటీవల ఘనా దేశం ఆయనకు తన అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. ఇది మోదీకి విదేశాల నుంచి లభించిన 24వ అత్యున్నత గౌరవం కావడం విశేషం. భారత ప్రధానిగా సేవలు అందిస్తున్న ఒక నేతకు ఇది ఒక అరుదైన గుర్తింపుగా నిలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
విదేశాంగ రాజకీయాల్లో భారత ప్రభావాన్ని పెంచడంలోనూ, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ప్రధాని మోదీ పాత్ర కీలకమైంది. అనేక దేశాలు ఆయనకు గౌరవాన్ని ఇస్తున్నాయంటే, ఈ దేశాలు మోదీ నాయకత్వంలోని భారతదేశాన్ని ఒక శక్తిమంతమైన, బాధ్యతాయుత దేశంగా చూస్తున్నాయని స్పష్టమవుతోంది.
-గౌరవం ఇచ్చిన 24 దేశాలు
ప్రధాని మోదీకి గౌరవం తెలిపిన దేశాల జాబితాలో ప్రముఖ దేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:
అమెరికా (USA),యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE),సౌదీ అరేబియా,
కువైట్,రష్యా,ఫ్రాన్స్,ఈజిప్ట్,పాలస్తీనా,అఫ్గానిస్థాన్, మాల్దీవ్స్ ,భూటాన్ ,ఫిజీ, నైజీరియా,మారిషస్,శ్రీలంక, గయానా, డొమెనికా, బార్బడోస్, సైప్రస్, గ్రీస్, రిపబ్లిక్ ఆఫ్ పాలవ్, పపువా న్యూగినియా, బహ్రెయిన్, ఘనా
ఈ దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందజేయడం వల్ల, భారతదేశానికి ప్రపంచంలో గల ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
నాయకత్వాన్ని మెచ్చుకుంటున్న ప్రపంచం
ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని మెచ్చుకోవడానికి ప్రధాన కారణాలు.. అతని నాయకత్వ లక్షణాలు, అభివృద్ధిపై దృష్టి, అంతర్జాతీయ సంబంధాల్లో నిబద్ధత. ముఖ్యంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అంశం వసుధైక కుటుంబం వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే ధ్యేయాన్ని ఆయన నిశ్శబ్దంగా కార్యరూపంలో దించడమే.
ప్రపంచ దేశాల నుంచి ఇలా వరుసగా గౌరవాలు అందుకోవడం భారతదేశ ప్రజలకే గర్వకారణం. ఇది వ్యక్తిగతంగా మోదీకి కాదు, భారతదేశ విశ్వసనీయతకు, సామర్థ్యానికి లభించిన గుర్తింపు. భవిష్యత్తులో మరిన్ని దేశాల నుంచి ప్రధాని మోదీకి ఇటువంటి గౌరవాలు అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
