మోడీ ఫొటో క్రేజ్ కోసం దేశం పరువుపోయిందా?
ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ, శామ్ ఆల్ట్‌మన్ చేతిని గాలిలోకి ఎత్తడం, అదే సమయంలో పక్కనే ఉన్న డారియో అమోడీతో సమన్వయ లోపం తలెత్తడం చర్చనీయాంశమైంది.
By: A.N.Kumar | 20 Feb 2026 1:10 PM ISTఅంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు కేవలం చర్చలకే పరిమితం కావు.. అక్కడ ప్రదర్శించే బాడీ లాంగ్వేజ్ , కరచాలనాలు, నిలబడే తీరు కూడా ఒక బలమైన దౌత్య సంకేతాన్ని పంపిస్తాయి. ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ, శామ్ ఆల్ట్‌మన్ చేతిని గాలిలోకి ఎత్తడం, అదే సమయంలో పక్కనే ఉన్న డారియో అమోడీతో సమన్వయ లోపం తలెత్తడం చర్చనీయాంశమైంది.
అతిగా స్పందిస్తున్నామా?
సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ వైరల్ అయిన వెంటనే "దేశ గౌరవం", "డిప్లొమాటిక్ ఎంబరాస్‌మెంట్" వంటి భారీ పదజాలంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే ఒక విషయాన్ని మనం నిశితంగా గమనించాలి. అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ఒకే వేదికపై ఉన్నప్పుడు, ఫోటోగ్రాఫర్ల సూచనలు, ఆ సమయానికి ఉండే ఉత్సాహం మధ్య చిన్నపాటి గందరగోళం సహజం. దీనిని దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా నెటిజన్లు మోడీ ఫొటో క్రేజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
క్లారిటీ లేని ప్రోటోకాల్
మోడీ అలా ఫొటో క్రేజ్ కోసం స్వయంగా చేతులు పైకెత్తడంతో చాట్ జీపీటీ అధినేత ఆల్ట్ మన్ గందరగోళానికి గురయ్యారు. దీనిపై శామ్ ఆల్ట్‌మన్ స్వయంగా స్పందిస్తూ "అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను" అని చెప్పడం గమనార్హం. దీనిని బట్టి ఇది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అని స్పష్టమవుతోంది. వేదికపై ఉన్న వ్యక్తుల మధ్య ముందస్తు సమన్వయం లేకపోవడం లేదా ఆ క్షణంలో జరిగిన ఆకస్మిక చర్య వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
సింబాలిజం.. వాస్తవం
రాజకీయ నాయకులకు ఫోటోలు, వీడియోలు ప్రజల్లోకి వెళ్లే విధానం చాలా ముఖ్యం. మోదీ గారు అగ్రనేతగా తన ఉనికిని చాటుకునే క్రమంలో చేసిన ప్రయత్నం, టెక్ దిగ్గజాలకు కొత్తగా అనిపించి ఉండవచ్చు. కానీ, దీనివల్ల ఏఐ దిగ్గజాలకు ఇబ్బంది కలిగిందని లేదా ప్రధాని కావాలనే ఇలా చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే టెక్ ప్రపంచం ఎప్పుడూ ఫలితాలు, ఆవిష్కరణల మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఇలాంటి చిన్న క్షణాల మీద కాదు. ఫొటోలు, ఫోజుల కోసం వారు తహతహలాడరు. మోడీలో ఫొటోల కోసం ఫోజులు ఇవ్వరు.
ఏదైనా ఒక సంఘటనను అది జరిగిన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రాజకీయ కోణంలో చూస్తే ఖచ్చితంగా మోడీపై విమర్శలకు తావిస్తుంది. కానీ వాస్తవిక కోణంలో చూస్తే ఇది ఒక టెక్నికల్ మిస్-కమ్యూనికేషన్ మాత్రమే. చిన్నపాటి గందరగోళాన్ని పెద్ద రాజకీయ వివాదంగా మారడంతో మోడీ టార్గెట్ అయ్యారు. అసలైన చర్చ ఏఐ అభివృద్ధి, దాని భవిష్యత్తు పక్కదారి పట్టి ఈ వివాదం ముదిరింది. ప్రపంచం ముందు మోడీ ఫోటో షో అప్ వైరల్ అయ్యింది.
