Begin typing your search above and press return to search.

కొలోసియం కంటే ఎక్కువగా వైరల్‌ అయిన మోదీ-మెలోనీ సెల్ఫీ!

ఆ ఫొటోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ… “వెల్ కమ్ టు మై ఫ్రెండ్” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే క్షణాల్లో ఈ ఫొటో మిలియన్ల కొద్దీ వ్యూస్.. లైకులతో దూసుకుపోయింది.

By:  A.N.Kumar   |   20 May 2026 1:08 PM IST
కొలోసియం కంటే ఎక్కువగా వైరల్‌ అయిన మోదీ-మెలోనీ సెల్ఫీ!
X

దౌత్య చర్చలా? లేక సోషల్ మీడియా పండగా? ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న ట్రెండ్ చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తో కలిసి మోదీ దిగిన తాజా ఫొటోలు, సెల్ఫీలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. “రోమ్ వీధుల్లో చరిత్ర నడిచిందా? లేక సోషల్ మీడియాలో ‘మెలోడీ’ మ్యాజిక్ మళ్లీ మొదలైందా?” అంటూ నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.

కొలోసియం సాక్షిగా.. “మెలోడీ” మ్యాజిక్!

రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి జార్జియా మెలోనీ ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ప్రత్యేక డిన్నర్‌లో పాల్గొన్నారు. అయితే అసలు సిసలైన కంటెంట్ దొరికింది మాత్రం చారిత్రక కొలోసియం వద్దే.. ఇద్దరూ కలిసి అక్కడ ఒక క్రేజీ సెల్ఫీ దిగారు.

ఆ ఫొటోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ… “వెల్ కమ్ టు మై ఫ్రెండ్” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే క్షణాల్లో ఈ ఫొటో మిలియన్ల కొద్దీ వ్యూస్.. లైకులతో దూసుకుపోయింది. రోమ్ చారిత్రక కట్టడం కొలోసియం కంటే కూడా ఈ సెల్ఫీయే ఎక్కువ వైరల్ కావడం విశేషం.

“భారత్-ఇటలీ బంధం బలోపేతం”.. నెటిజన్ల వెరైటీ ట్విస్ట్!

ఇక ప్రధాని మోదీ కూడా కారులో కలిసి ప్రయాణించిన విజువల్స్, డిన్నర్ టేబుల్, కొలోసియం సందర్శన ఫొటోలను షేర్ చేశారు. “భారత్-ఇటలీ సంబంధాల బలోపేతంపై చర్చలకు ఎదురుచూస్తున్నా” అని మోదీ ట్వీట్ చేయగా.. నెటిజన్లు మాత్రం సాధారణ దౌత్య చర్చలు, అంతర్జాతీయ ఒప్పందాలను పక్కన పెట్టేసి, “మెలోడీ ఈజ్ బ్యాక్” అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. “ఇండియా-ఇటలీ ఒప్పందాల కంటే.. ఇద్దరి మధ్య సెల్ఫీల సంఖ్యే ఎక్కువగా ఉంది! ..పాపం.. కొలోసియం కూడా ఈ ఇద్దరి నేతలను చూసి షాక్ అయ్యుంటుంది!’’ అంటూ రాసుకొచ్చారు.

‘మెలోడీ’ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

గతంలో జీ20 సదస్సు సమయంలో పుట్టుకొచ్చిన “Melodi” హ్యాష్‌ట్యాగ్.. ఇప్పుడు రోమ్ వేదికగా మళ్లీ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఒకవైపు రాజకీయ విశ్లేషకులు.. “ఈ చొరవ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, దౌత్య బంధానికి చాలా మంచి సంకేతం” అని విశ్లేషిస్తుంటే.. సోషల్ మీడియా ప్రియులు మాత్రం “మెలోడీ ఫ్యాన్స్‌కు ఈ వీకెండ్‌కు సరిపడా ఫుల్ మీల్స్ దొరికింది” అంటూ తెగ ఖుషీ అయిపోతున్నారు. మొత్తానికి మోదీ ఇటలీ టూర్ పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాదు.. మీమ్స్ ప్రపంచంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.