Begin typing your search above and press return to search.

మోదీ ఎఫెక్ట్‌తో పార్లే షేర్స్ జంప్… కానీ అసలు ట్విస్ట్ చూస్తే షాక్!

నెటిజన్లు ఎప్పటి నుంచో మోదీ, మెలోనిల బంధాన్ని 'మెలోడి' అని పిలుస్తుంటారు. ఈ పేరుకు తగ్గట్టే, మోదీ మెలోనికి 'మెలోడీ' చాక్లెట్ ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   20 May 2026 4:29 PM IST
మోదీ ఎఫెక్ట్‌తో పార్లే షేర్స్ జంప్… కానీ అసలు ట్విస్ట్ చూస్తే షాక్!
X

ఇంటర్నెట్‌లో మన ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనిల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మోదీ ఇటలీ పర్యటనలో మెలోనికి మన దేశానికి చెందిన 'మెలోడీ' చాక్లెట్ ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాదు.. ఏకంగా స్టాక్ మార్కెట్‌నే ఊపేసింది! ఈ ఒక్క గిఫ్ట్ దెబ్బకు ఒక పార్లే కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం పెరిగాయి. అయితే, ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందండోయ్..ఆ వివరాలు చూద్దాం.

మోదీ ఇటలీకి ఎందుకు వెళ్లారు?

భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీ దేశానికి వెళ్లారు. అక్కడ ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు, భవిష్యత్తు వ్యాపార, రాజకీయ ఒప్పందాల గురించి చర్చలు జరపడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రోమ్ నగరంలో ల్యాండ్ అవ్వగానే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీకి గ్రాండ్ డిన్నర్ ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

వైరల్ అయిన 'మెలోడీ' గిఫ్ట్:

నెటిజన్లు ఎప్పటి నుంచో మోదీ, మెలోనిల బంధాన్ని 'మెలోడి' అని పిలుస్తుంటారు. ఈ పేరుకు తగ్గట్టే, మోదీ మెలోనికి 'మెలోడీ' చాక్లెట్ ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెలోని కూడా ఎంతో ఆనందంగా ఆ చాక్లెట్ తిని, "ఇది చాలా చాలా మంచి టాఫీ" అంటూ పొగిడారు. ఇక ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల తొందరపాటు:

ఈ వీడియో వైరల్ అవ్వగానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అలర్ట్ అయిపోయారు. 'ఇక మెలోడీ చాక్లెట్ల బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, పార్లే కంపెనీకి లాభాల పండగే' అని ఊహించుకున్నారు. ఆలస్యం చేస్తే ఎక్కడ చేతులు దాటిపోతుందో అని కంగారు పడిపోతూ, మార్కెట్లో 'పార్లే' అని పేరున్న షేర్లను ఎగబడి మరీ కొనేశారు.

అసలు లాభపడింది ఎవరు?:

ఇన్వెస్టర్ల దెబ్బకు స్టాక్ మార్కెట్లో ఉన్న 'పార్లే ఇండస్ట్రీస్' అనే కంపెనీ షేర్లు ఏకంగా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అందరూ మెలోడీ చాక్లెట్ కంపెనీ షేర్లే కొంటున్నామని సంబరపడిపోయారు. కానీ, ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది.

షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే?:

అసలు ట్విస్ట్ ఏంటంటే.. మనం రోజూ తినే బిస్కెట్లు, మెలోడీ చాక్లెట్లు తయారు చేసే కంపెనీ పేరు 'పార్లే ప్రొడక్ట్స్'. ఈ ఒరిజినల్ చాక్లెట్ కంపెనీ అసలు స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ అవ్వలేదు.. మరి లాభపడిన 'పార్లే ఇండస్ట్రీస్' ఏం చేస్తుందో తెలుసా? ఇక అది ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ చేసే కంపెనీ. పేరులో 'పార్లే' అని ఉంది కదా అని తెలీక చాలా మంది తప్పుడు కంపెనీ షేర్లు కొనేశారు.

స్టాక్ మార్కెట్లో సరైన రీసెర్చ్ లేకుండా కేవలం పేరు చూసి లేదా ట్రెండ్ చూసి తొందరపడితే ఎలాంటి కామెడీ జరుగుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఇక ప్రధాని మోదీ ఇచ్చిన చాక్లెట్ గిఫ్ట్ వల్ల.. సంబంధమే లేని ఒక మేనేజ్‌మెంట్ కంపెనీకి లక్ కలిసి వచ్చి షేర్లు పెరగడం నిజంగా ఒక అదిరిపోయే ట్విస్టే కదా అని నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.