Begin typing your search above and press return to search.

పాక్ మీద మోడీ సర్కార్ ఉగ్ర స్వరం....ఏమి జరగనుంది ?

ఇలా బయట గెలిచిన భారత్ మరోసారి పాక్ మీద అనూహ్యంగా విరుచుకుపడుతుందా అన్న చర్చ అయితే మొదలైంది.

By:  Tupaki Desk   |   31 May 2025 12:11 AM IST
పాక్ మీద మోడీ సర్కార్ ఉగ్ర స్వరం....ఏమి జరగనుంది ?
X

పాకిస్థాన్ మీద కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉగ్ర రూపం చూపిస్తోంది. పాకిస్థాన్ పీచమణుస్తామని అంటోంది. రెండు రోజుల పాటు గుజరాత్ లో మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పాక్ మీదనే విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు పాక్ ఎయిర్ బేస్ మొత్తం కోమాలో ఉందని ఎద్దేవా చేశారు. మాతో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో అదే చేసి చూపించామని కూడా ఖండితంగా చెప్పారు.

అక్కడ నుంచి బీహార్ లో రెండు రోజులు మోడీ పర్యటించారు. ఆ మీదట యూపీలో పర్యటించారు. ఎక్కడ చూసినా మోడీ స్వరంలో కఠినంగానే పాక్ మీద ఉంది. పాక్ ఉగ్ర దాడులకు తిరుగులేని జవాబు ఇచ్చామని చెప్పిన మోడీ ఆపరేషన్ సిందూర్ ఆగేది కాదని మరోసారి చెప్పారు. అది నిరంతరం సాగుతుందని అన్నారు.

భారత్ స్వదేశీయ రక్షణ వ్యవస్థతోనే పాక్ మీద దాడులు చేశామని ఆయన చెప్పారు. పాక్ కి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు అని మరో వైపు హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ లో పర్యటిస్తూ పాక్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ లో ఉగ్ర భూతం ఉందని అన్నారు. దానికి భారత్ ధీటైన సమాధానం చెప్పిందని ఇంకా చేయాలనుకుంటే తగిన జవాబు సిద్ధంగా ఉందని అన్నారు.

ఇంకో వైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా ఇదే విధంగా గర్జించారు. పాక్ లోని ఉగ్ర శిబిరాలను మొత్తం పాక్ నిర్మూలించాలని డిమాండ్ చేశారు. అలా చేయడం పాక్ కే మంచిదని హితవు పలికారు. పాక్ వాయు జల ఆకాశ మార్గాలలో ఏ వైపు నుంచి వచ్చినా దానికి పకడ్బందీగా జవాబు చెప్పగల సత్తా భారత్ కి ఉందని అన్నారు.

పాక్ నేల నుంచే భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. ఈ విధంగా ప్రధాని సహా ఇద్దరు కీలక మంత్రులు పాక్ మీద ఒకేసారి ఒకే గొంతుతో గట్టిగా విరుచుకుపడడం తో ఏమి జరుగుతుందో అన్న చర్చ అయితే మొదలైంది. ఇంకో వైపు అఖిల పక్ష ఎంపీల బృందాలు ఇతర దేశాలలో పర్యటిస్తూ పాక్ ఉగ్రదాడుల గురించి అందరికీ వివరిస్తున్నారు. పాక్ చేస్తున్న ఆగడాల గురించి కూడా పూర్తిగా వివరిస్తున్నారు

దాంతో భారత్ దౌత్యానికి ప్రపంచ దేశాల మద్దతు దక్కుతోంది. అంతే కాదు పాక్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి కూడా మంచి మద్దతు లభ్స్తోంది. ముస్లిం దేశాలు కూడా భారత్ వైపే ఉండడం కూడా భారత్ కి ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తోంది.

ఇలా బయట గెలిచిన భారత్ మరోసారి పాక్ మీద అనూహ్యంగా విరుచుకుపడుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. ట్రంప్ వల్లనే యుద్ధం ఆపేశారు అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. జై హింద్ పేరుతో కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహిస్తోంది. పాక్ అంతు చూస్తామని మోడీ సర్కార్ అనడం వల్లనే మద్దతు ఇచ్చామని మధ్యలో దాడులు ఆపేశారని ఆడిపోసుకుంటోంది.

ఈ నేపధ్యంలో కేంద్రం కూడా తన స్వరాన్ని మార్చి పాక్ మీద తీవ్రంగానే మాట్లాడుతోంది. మరి ఇది చివరికి ఏ వైపునకు దారి తీస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ ఆగదని ఒక వైపు కేంద్రం చెబుతోంది. మరో వైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తెస్తామని కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే మరో మెరుపు దాడులకు భారత్ సర్వ సన్నద్ధం అవుతోందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.