Begin typing your search above and press return to search.

మోడీ బాబు పిలుపు తమ్ముళ్ల చెవికెక్కడం లేదా ?

దేశంలో ఒకవైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని ముందే గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తాజా హైదరాబాద్ పర్యటనలో ఒక కీలక సూచనతో కూడిన సందేశం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 May 2026 9:00 AM IST
మోడీ బాబు పిలుపు తమ్ముళ్ల చెవికెక్కడం లేదా ?
X

దేశంలో ఒకవైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని ముందే గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తాజా హైదరాబాద్ పర్యటనలో ఒక కీలక సూచనతో కూడిన సందేశం ఇచ్చారు. అది ఏమిటంటే ఎవరు బంగారం కొనుగోలు చేయవద్దు అని. కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకండి అని ప్రధానమంత్రి ప్రజలకు నేరుగానే విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మన దేశంలో నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం వల్ల మనం విదేశాల నుంచి టన్నులకు టన్నులు బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున తరిగిపోతోంది. భారతదేశంలో ముడి చమురు దిగుమతుల తరువాత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారం మాత్రమే. దాంతో భారతదేశానికి రానున్న ఇబ్బందికర పరిస్థితులు ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై కూడా తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించింది. ఏకంగా 15 శాతం పైగా దిగుమతి సుంకాలను విధిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని మీద రకరకాలుగా చర్చ సైతం సాగుతోంది.

భారతీయుల సెంటిమెంట్ :

ఎలాగంటే బంగారం మీద మన భారతీయులకు ఎంతో మోజు ఉంటుంది. దాంతో పాటుగా బంగారం అనేది పెట్టుబడి అని, సంపదని, లక్ష్మీదేవి అని ఎన్నో రకాలైన సెంటిమెంట్లు ప్రజలలో ఎక్కువగానే ఉన్నాయి. దాంతో బంగారం కొనుగోలు తగ్గుతున్నాయా లేదా అని పక్కన పెడితే ప్రభుత్వాలు పాలకవర్గాలు తాము చేయాల్సిన ప్రయత్నాన్ని గట్టిగానే చేస్తున్నాయి. అలా ఎన్డీఏ ప్రభుత్వాలు మిత్రులు కూడా బంగారు కొనుగోలు వద్దు అని చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో చూస్తే అతి కీలకమైన పార్టీగా ఎన్డీఏ మిత్రుడిగా ఉన్న తెలుగుదేశం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు నిర్ణయాలు కానీ చర్యలు కానీ సబబు అని ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తప్పనిసరిగా జనాల్లో ఈ విషయాన్ని ఉంచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. అయితే అదే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అతి ముఖ్యుడు మాజీ ఎమ్మెల్సీ అయిన టీడీ జనార్ధన్ తాజాగా ఒక బంగారు దుకాణం దగ్గర కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి.

బంగారం దుకాణంలో అలా :

టీడీ జనార్ధన్ బంగారం షాపులో అక్కడ నగలను పరికిస్తూ కనిపించారు. ఇంతకీ ఆయన బంగారం కొంటున్నారా లేక నగలను చూస్తున్నారా లేక అక్కడ దుకాణం యజమానులకు ఏమైనా సలహా సూచనలు ఇస్తున్నారా అన్నది తెలియదు కానీ బంగారం వద్దు అని పాలకులు అంటున్న సమయంలో ఒక టీడీపీ తమ్ముడు ఇలా నగల దుకాణంలో కనిపించడం మాత్రం ఆసక్తిని రేపుతోంది. పొదుపు అదుపు అని దేశమంతా అంటున్న ఇటువంటి కీలక తరుణంలో ఎన్డీయేకు ఒక మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు ఈ విధంగా బంగారం కొనుక్కోవడానికా అన్నట్లుగా బంగారం దుకాణంలో కనిపించడం మాత్రం చర్చకు తావిస్తోంది.





ప్రోత్సహిస్తున్నారా :

ఒక ప్రక్క ప్రధాని నరేంద్ర మోడీ మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు పాటిస్తూ ఉంటే బంగారం విషయంలో ప్రజలకి చెప్పవలసింది చెప్పి ఒప్పించాల్సిన పరిస్థితుల్లో ఉంటే అదే పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు ఈ విధంగా బంగారం దుకాణాల్లో ఆభరణాలను తిలకిస్తూ పరికిస్తూ ప్రోత్సహిస్తున్నారా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఇది ఏ రకమైన సందేశాన్ని తీస్తుంది అని కూడా అంతా అంటున్నారు. మరి ఈ విషయంలో మాజీ ఎమ్మెల్సీ టీవీ జనార్దన్ చెప్తారో తెలీదు కానీ ఆయన బంగారం దుకాణానికి వెళ్ళడం మాత్రం ఒక చర్చగానే ఉంది. ఇది పాలకుల నిర్ణయానికి కాస్త భిన్నంగానే ఉందని అంటున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా సమర్ధించుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా చేయడం బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించడం ప్రజలకు విరుద్ధంగా కనిపిస్తోందని కూడా అంటున్నారు. ఒక వైపు ప్రజలు ఖర్చులు తగ్గించమని చెబుతున్న పాలకులు తమ పార్టీ నాయకులకు ఆ సూచనలు చేయడం లేదా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విధంగా చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.