Begin typing your search above and press return to search.

వార్ వేళ మరెవరికీ సాధ్యం కానిది మోడీకే సాధ్యమట!

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోని ఏ దేశమైనా..మహా అయితే ఒక దేశంతోనో.. లేదంటే రెండు దేశాలతో మాట్లాడగలుగుతారు.

By:  Garuda Media   |   29 March 2026 9:14 AM IST
వార్ వేళ మరెవరికీ సాధ్యం కానిది మోడీకే సాధ్యమట!
X

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోని ఏ దేశమైనా..మహా అయితే ఒక దేశంతోనో.. లేదంటే రెండు దేశాలతో మాట్లాడగలుగుతారు. కానీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇస్పెషల్. ఒకే సమయంలో ఈ మూడు దేశాలతో మాట్లాడే సత్తా..ఏదైనా అంశాన్ని కమ్యూనికేట్ చేయగలిగిన సామర్థ్యం భారత ప్రదాని నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమని చెప్పాలి. పరస్పర ప్రత్యర్థి దేశాలకు చెందిన దేశాధినేతలతో విడివిడిగా.. నేరుగా మాట్లాడే సత్తా మాత్రమే కాదు.. అన్నింటికి మించి యాక్సెస్ ఉన్న ఏకైన నాయకుడు మోడీగా చెప్పాలి.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఈ మూడు దేశాలతో మాత్రమే కాదు.. యూఏఈ దేశాలతోనూ నేరుగా మాట్లాడే సామర్థ్యం మోడీ సొంతం. అందుకే.. తాజాగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపే శక్తి ఒక్క మోడీకే ఉందంటూ యూఏీ లాంటి దేశాలు ఓపెన్ గా చెప్పేస్తున్న పరిస్థితి. అయినప్పటికి తొందరపాటుతో కాకుండా..ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ అడుగులు వేస్తున్నారు నరేంద్ర మోడీ.

మిగిలిన దేశాధినేతలకు.. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యత్యాసం ఏమంటే.. ఏ దేశాధినేత కానీ దేశ ప్రధాని కానీ తమ ప్రయోజనాల కోసం మాట్లాడటం కనిపిస్తుంది.కానీ.. అందరితోనూ మాట్లాడగలిగే సామర్థ్యం మోడీకి మాత్రమే ఉందని చెప్పాలి. ఇదే.. ఆయన చేత పలు దేశాలకు చెందిన దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడేలా చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ మాత్రమేనా? ఇంకే నాయకుడు ఈ తరహా పని చేయట్లేదా? అంటే.. చేస్తున్నట్లుగా చెప్పొచ్చు.కానీ.. మోడీ స్థాయిలో మాత్రం కాదని చెప్పాలి.

మోడీ గురించి చెప్పటానికి ముందు.. ఇతర దేశాధినేతలు చర్చలు ఏమేరకు వచ్చాయన్నది ప్రశ్న. అదే సమయంలో ఏ దేశాధినేత.. ఏమేం చర్యలు చేపట్టారన్నది కూడా ఆసక్తికరమే. ఆ అంశాల్ని చూస్తే.. యుద్ధం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధానితో పాటు.. సౌదీ యువరాజుతో నిరంతరం మాట్లాడటం కనిపిస్తుంది. ఇదంతా అమెరికా ప్రయోజనాల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది

పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా కూటమి మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాక్ సిద్ధమని ప్రకటించింది. అదే విధంగా పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ మలేషియా, ఇండోనేషియా దేశాధినేతలతో మాట్లాడతారు. వీరే కాకుండా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లేయెన్ తో పాటు.. రష్యా అధినేత పుతిన్ సైతం మాట్లాడుతున్నారు. అయితే.. వీరందరికి మించి మోడీ మాత్రం పెద్ద ఎత్తున దేశాధినేతలతో మాట్లాడటం కనిపిస్తుంది. ఆ జాబితాను చూస్తే..

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తో ఇప్పటివరకు రెండుసార్లు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పలుమార్లు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తోనూ రెండు మార్లు.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తోనూ మాట్లాడారు. వీరితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్, జోర్డాన్, ఒమన్, మలేషియా, బహ్రెయిన్, కువైట్ దేశాధినేతలతో మాట్లాడిన పరిస్థితి. ఇన్ని దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడి..దౌత్య చొరవను ప్రధాని మోడీ ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.