నా నియోజకవర్గం ఎప్పటికీ నాదే: మోడీ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారణాసి ప్రజలను ఉద్దేశిం చి మాట్లాడుతూ.. కుటుంబ పార్టీల వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 12 April 2025 11:00 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం వారణాసి ఎప్ప టికీ.. తనదేనని..వేరేవారికి ఇక్కడ చోటు లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. సహజంలో ఒక నియోజకవర్గంలో గెలిచిన నేత.. మళ్లీ మళ్లీ అక్కడే గెలుస్తారా? లేదా..? అనేది అక్కడి ప్రజలు నిర్ణయించాల్సిన విషయం. ఈ విషయంలో ఓటర్లదే తుది నిర్ణయం. కానీ, తాజాగా మోడీ మాత్రం..``ఈ కాశీ ఎప్పటికీ నాదే. వేరేవారికి చోటు పెట్టదు`` అని వ్యాఖ్యానించారు.
తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని.. 3800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారణాసి ప్రజలను ఉద్దేశిం చి మాట్లాడుతూ.. కుటుంబ పార్టీల వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు.. తాము , తమ కుటుంబం, తమ ముందు తరాల గురించే ఆలోచిస్తాయని చెప్పారు. వారి కోసమే దేశ సంపదను దోచుకుంటారని తెలిపారు. కానీ.. ఈ విధానాన్ని తాము వ్యతిరేకించామని.. ప్రజలకు అన్ని విదాలా సాయం చేస్తున్నామన్నారు.
`సబ్ కా సాథ్-సబ్ కా వికాస్`తమ మూల మంత్రమన్న ప్రధాని.. సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసినట్టు వివరించారు. కాశీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి ప్రజలకు అన్నీ అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఆరోగ్య సేవల కోసం.. వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని.. కానీ, తాను వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజారోగ్య కేంద్రా లకు పెద్ద పీట వేసినట్టు వివరించారు.
ప్రజల కష్టసుఖాలను పంచుకుంటున్నామన్నారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో వేరేవారికి చోటు లేద ని.. ఎప్పటికీ ఇక్కడి ప్రజలు తనను గుర్తు చేసుకుంటూనే ఉంటారని తెలిపారు. అందుకే.. నా నియోజక వర్గంలో నాకు తప్ప.. వేరేవారికి చోటు ఉండదన్న నమ్మకం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
