మోడీ మీటింగ్ : ముఖ్యమంత్రులకు ఏం చెప్పబోతున్నారు ?
గతంలో కరోనా టైం లో అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతీ పదిహేను రోజులకు ఒక సారి కేంద్ర ప్రభుత్వం దేశంలోని పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ ఉండేది.
By: Satya P | 27 March 2026 9:40 AM ISTగతంలో కరోనా టైం లో అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతీ పదిహేను రోజులకు ఒక సారి కేంద్ర ప్రభుత్వం దేశంలోని పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ ఉండేది. మోడీ అయితే ప్రసార మాధ్యమాల ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించేవారు. అదే సమయంలో పలు మార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వర్చువల్ గా మీటింగులు నిర్వహించేవారు. ఆయా రాష్ట్రాలలో పరిస్థితులను తెలుసుకునే వారు వారికి సలహా సూచనలు ఇచ్చేవారు. ఫీడ్ బ్యాక్ ని తీసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఇపుడు చూస్తే గల్ఫ్ వార్ ప్రపంచం ముందు ఉంది. తాజాగా పార్లమెంట్ లో మోడీ అయితే కరోనా లాంటి సమస్యలు అని కూడా కూడా మాట్లాడారు, అంతే కాదు పెను సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది అని కూడా చెప్పారు. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు దేశంలోని ముఖ్యమంత్రులతో మోడీ ఈ నెల 27న వర్చువల్ గా మీట్ పెట్టబోతున్నారు. దాంతో ఏమి చెప్పబోతున్నారు అన్న ఆసక్తి అయితే అందరిలో ఏర్పడుతోంది.
ఇదే ఫస్ట్ టైం :
పశ్చిమ ఆసియా సంక్షోభం ముదిరిన తరువాత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి. దాంతో సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఈ మీట్ లో ఏమి మాట్లాడనున్నారు అంటే గల్ఫ్ వార్ నేపధ్యంలో దేశం ఏ విధంగా సిద్ధంగా ఉండాలని అంటున్నారు. అంతే కాదు, దేశంలో ఇంధన భద్రత గురించి కూడా చర్చిస్తారు అని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్ళు ఎదురైనపుడు టీమ్ ఇండియాగా నిలిచి అంతా ఏక త్రాటి మీద ఉండాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పబోతున్నారు అని అంటున్నారు.
ధీటుగా ఎదుర్కోనేందుకు :
పరిస్థితులు అంతర్జాతీయంగా ఎప్పటికపుడు మారుతున్నాయి. దాంతో ఎటువంటి ప్రతికూల వాతావరణం ఎదురైనా కూడా తట్టుకుని ముందుకు సాగేందుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడగట్టేందుకు మోడీ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అని అంటున్నారు. కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణపై సుదీర్హంగా మోడీ చర్చిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశం ద్వారా సమన్వయంతో కూడిన ఒక జాతీయ స్తాయి దృకప్ధాన్ని రూపొందించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. అనా కలసి సమిష్టిగా టీమ్ ఇండియా మాదిరిగా ముందుకు సాగడం ఏకీకృత విధానాన్ని బలోపేతం చేయడంపైన దృష్టి సారించడానికే ఈ మీటింగ్ ఉంటుందని అంటున్నారు.
చురుకైన పాత్ర కోసం :
ఇప్పటిదాకా కేంద్రం తన పనిని తాను నిర్వహిస్తోంది. కానీ ఇపుడు రాష్ట్రాలను కూడా క్రియాశీలకంగా ఉంచేందుకు చూస్తోంది అని అంటున్నారు. చురుకుగా రాష్ట్రాలు కూడా ఈ సంక్షోభం వేళ ఉండడం ద్వారా కేంద్రానికి సహకరించాలన్నది ప్రభుతవ్ ఆలోచనగా చేబుతున్నారు. అదే పనిగా ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం , దాని పర్యవసానాలు దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం దేశంలో ఉంది. అంతే కాకుండా కేవలం ఇండియాకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. అలాగే ఒక పెద్ద ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదాన్ని కూడా కేంద్రం ముందస్తుగా ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామాలకు ముందుగా రాష్ట్రాలను సమాయత్తం చేయడం కూడా అజెండాగా ఉంది. అలాగే తమ రాష్ట్రాలలో ప్రజలను కూడా ఆ దిశగా సిద్ధం చేయడం కోసం కూడా ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం ఈ మీటింగ్ చేస్తుంది అని అంటున్నారు.
గొలుసు కట్టు వ్యవస్థ పటిష్టం :
దేశీయంగా ఉన్న ఇంధన గ్యాస్ సరఫరా గొలుసు కట్టు వ్యవస్థను మరింతగా పటిష్టం చేయడంతో పాటు దేశంలోని బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యత కల్పించడానికి కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కోరుతూ మోడీ పిలుపు ఇస్తారని అంటున్నారు. ఆలాగే, రైతులను కాపాడటం పేద, వలస వర్గాలకు నిత్యావసర వస్తువుల లభ్యతను కొనసాగించడం వంటి వాటి అవసరాన్ని ఈ మీటింగ్ ద్వారా స్పష్టం చేస్తారు అని అంటున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
