Begin typing your search above and press return to search.

అటు మోడీ-ఇటు చంద్ర‌బాబు.. హెచ్‌పీవీ వ్యాక్సినేష‌న్‌.. ఏంటిది?

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ ర్గంలో సీఎం చంద్ర‌బాబు ఒకేసారి.. ఒకే స‌మ‌యంలో శ‌నివారం హెచ్‌పీవీ వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు.

By:  Garuda Media   |   28 Feb 2026 4:02 PM IST
అటు మోడీ-ఇటు చంద్ర‌బాబు.. హెచ్‌పీవీ వ్యాక్సినేష‌న్‌.. ఏంటిది?
X

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ ర్గంలో సీఎం చంద్ర‌బాబు ఒకేసారి.. ఒకే స‌మ‌యంలో శ‌నివారం హెచ్‌పీవీ వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు. దేశ‌వ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు బాలిక‌ల‌కు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది ప్ర‌త్యేక డ్రైవ్‌. దేశంలో వ‌చ్చే మూడు మాసాల్లో సుమారు 20 కోట్ల మందికి పైగా బాలిక‌ల‌కు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనికి శ‌నివారం శ్రీకారం చుట్టారు.

ఏంటీ వ్యాక్సినేష‌న్‌?

హెచ్‌పీవీ.. అంటే హ్యూమ‌న్ ప‌పిల్లోమా వైర‌స్ అని అర్థం. దీనిని 14 ఏళ్లు నిండిన బాలిక‌లు ఇవ్వ‌డం ద్వారా.. భ‌విష్య‌త్తులో వారు గ‌ర్భాశ‌య ముఖ ద్వార క్యాన్స‌ర్‌కు గురికాకుండా చూడాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా బాలిక‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌కు గుర‌వుతున్నారు. దీంతో 2018లోనే ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.. ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి.. వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను సేక‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేసింది.

ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం పూర్తిచేయ‌గా.. భారత‌దేశంలో మాత్రం శ‌నివార‌మే ఈ వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. త‌ద్వారా బాలిక‌లకు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌రాకుండా చూడ‌నున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న అంచ‌నాల మేర‌కు.. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. తాగే నీరు క‌లుషితం కావ‌డంతో వ‌చ్చే ఈ క్యాన్స‌ర్‌కార‌ణంగా.. మ‌హిళ‌ల‌కు గ‌ర్భ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వీటిని నిరోధించాల‌న్న‌ది ప్ర‌ధాన ల‌క్ష్యం.

ఆరు ర‌కాల ప్ర‌యోజ‌నాలు..

1) గర్భాశయ క్యాన్సర్: గర్భాశయాన్ని ప్రభావితం చేసే క్యాన్సర్ రాకుండా ఆపుతుంది.

2) వల్వర్ క్యాన్సర్: మహిళల బాహ్య జననేంద్రియ అవయవాలను ప్రభావితం చేసే వ్యాధులను అడ్డుకుంటుంది.

3) యోని క్యాన్సర్: యోనిలో సంభవించే క్యాన్స‌ర్‌ను అడ్డుకుంటుంది.

4) ఆనల్ క్యాన్సర్: పాయువు యొక్క కణజాలాలలో అభివృద్ధి చెందే వ్యాధుల‌ను నిరోధిస్తుంది.

5) పురుషాంగ క్యాన్సర్: పురుషాంగాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

6) ఒరోఫారింజియల్ క్యాన్సర్: నాలుక మరియు టాన్సిల్స్ బేస్‌తో సహా గొంతు వెనుక భాగంలో సంభవించే క్యాన్స‌ర్‌ల‌ను అడ్డుకుంటుంది.