Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మురికి రాజకీయాలు: మోడీ ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌వి మురికి రాజ‌కీయా ల‌ని వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   23 Feb 2026 9:16 AM IST
కాంగ్రెస్ మురికి రాజకీయాలు:  మోడీ ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?
X

కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌వి మురికి రాజ‌కీయా ల‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే ఆ పార్టీని ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని.. అయినా ఇప్ప‌టికీ ఆ పార్టీకి బుద్ధి రాలేద న్నారు. భార‌త్‌ను వ్య‌తిరేకించే విదేశీ శ‌క్తులు చేతులు క‌లిపి దేశం ప‌రువు తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి పార్టీలు మ‌న‌కు అవ‌స‌రమా? అనిప్ర‌శ్నించారు. ఇంటా బ‌య‌టా కూడా.. కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని గుర్తు చేశారు.

అయిన‌ప్పటికీ ఆ పార్టీలో ఇసుమంత కూడా మార్పు రావ‌డం లేద‌న్న ప్ర‌ధాని.. ఇలాంటి పార్టీల‌ను ప్ర‌జ లు మ‌రింత‌గా ఛీకొట్టాల‌ని పిలుపునిచ్చారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఇం డియా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు ద్వారా.. దేశానికి మేలు చేయాల‌ని తాము భావిస్తున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు. కానీ, ఇదే వేదిక‌ను కాంగ్రెస్ పార్టీ త‌న రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు వేదిక‌గా మార్చుకుంద‌ని అన్నారు. ఇలాంటి కుటిల రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించారు.

అంత‌ర్జాతీయంగా వివిధ దేశాల‌కు చెందిన అధ్య‌క్షులు, ప్ర‌ధానులు ఉన్న వేదిక‌పై కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త లు.. అర్ధ‌నగ్నంగా వ‌చ్చి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డాన్ని ప్ర‌ధాని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇటువంటి ప‌నులు చేయ డం ద్వారా అంత‌ర్జాతీయంగా దేశ ప‌రువును పోగొడుతున్నార‌ని.. ఇప్ప‌టికే ఆ పార్టీ విదేశీ శ‌క్తుల‌తో క‌లిసి.. దేశంపై విషం చిమ్ముతోంద‌ని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. త‌గిన స‌మ యంలో త‌గిన విధంగా బుద్ధి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

ఏం జ‌రిగిందంటే..

ఏపీ ఇంపాక్ట్ స‌ద‌స్సుకు హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం కార్య‌క‌ర్త‌లు.. స‌ద‌స్సు జ‌రుగుతున్న స‌య‌మంలో అర్ధంత‌రంగా నిర‌స‌న‌కు దిగారు. పై చొక్కాలు తీసేసి.. అమెరికాతో మోడీకి ఉన్న సంబంధం ఏంటంటూ నినాదాలు చేశారు. ఈ విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌రం.. అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం వారిని వెతికి ప‌ట్టుకుని కేసులు పెట్టింది. ఈ వ్య‌వ‌హారం.. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ దుమారానికి తెర‌దీసేలా చేసింది.