కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్... కాబోయే మంత్రులకు ఫోన్లు !
మరో వారంలో పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం విశేషంగా చెబుతున్నారు.
By: Satya P | 13 July 2026 9:15 AM ISTకేంద్ర కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం అయినట్లుగా హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 15 న కేంద్ర కేబినెట్ సమూల ప్రక్షాళనకు రంగం సిద్ధం చేశారు. దాంతో హస్తినలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అని హాట్ హాట్ గా చర్చ మొదలైంది. మరో వారంలో పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం విశేషంగా చెబుతున్నారు. దాంతో ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు జాతీయ రాజకీయం అంతా పూర్తి అప్రమత్తం అయింది.
అందుబాటులో ఉండాలంటూ :
ఇదిలా ఉంటే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కేవారికి అధిష్టానం సమాచారం పంపిస్తున్నట్లుగా చెబుతున్నారు. తమకు పూర్తిగా అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఫోన్లు వెళ్తున్నాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొదలు కావడంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఇంక తప్పనిసరిగా జరగడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఫలనా టైం లో జరుగుతుందని కూడా ఊహాగానాలు వ్యాపించాయి. అంతే కాదు జూన్ లో అనేక డేట్స్ పెట్టారు, అయితే అవేమీ అవలేదు. ఇక జూలై మొదటి వారం అన్నారు. కానీ ఇపుడు మూడవరవానికి ముహూర్తం ఫిక్స్ అయింది అని అంటున్నారు.
పెద్ద ఎత్తున రేసులో :
మరో వైపు చూస్తే కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఎవరికి వారుగా తమ వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమకూ కేబినెట్‍లో చోటు అనుకుంటొ దానికోసం ఆశావహులంతా ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ దఫా అయినా తమ రాజకీయ జాతకం మారుతుందా అని కూడా ఎవరికి వారుగా ఆలోచిస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అన్నది ఈసారి పెద్ద ఎత్తున సాగనుంది అని అంటున్నారు. భారీ మార్పులు ఉంటాయని కూడా చెబుతున్నారు. దాంతో తమకు ఇదే మంచి చాన్స్ అని ఆశావహులు భావిస్తున్నారు.
మిత్రులకు భారీ చాన్స్ :
ఈసారి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రధానంగా మిత్రులకు భారీ చాన్స్ ఉంటుందని అంటున్నారు. దాంతో పాటుగా ఇప్పటికి ఉన్న దాని కంటే కూడా ఎన్డీయే మిత్రపక్షాలకు మరింతగా తగిన ప్రాతినిధ్యం దక్కుతుందని అంటున్నారు. అదే సమయంలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మహిళలకు పెద్దపీట వేస్తారు అని కూడా గట్టిగా వినిపిస్తోంది. దాంతో మహిళా ఎంపీలలో కూడా సరికొత్త ఆశలు మొదలయ్యాయని అంటున్నారు.
బాధ్యతలు భారాలూ :
ఈసారి కేంద్ర మంత్రులు అయ్యేవారి మీద అధిక బాధ్యతలు భారాలూ కూడా మోపుతారు అని తెలుస్తోంది. కేంద్ర మంత్రులను కూడా అనేక కారణాలతో తీసుకుంటున్నారు. ముఖ్యంగా రానున్న ఏడాదిలో ఎన్నికలు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఉన్నాయి. దంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత కేంద్ర మంత్రి వర్గంలో దక్కుతుందని అంటున్నారు. దాంతో ఆయా చోట్ల కొత్తగా మంత్రులు అయ్యేవారు బీజేపీని ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక కొంత మంది కేంద్రమంత్రులను తప్పించి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి కేంద్ర మంత్రివర్గం నుంచి అవుట్ అయ్యే వారు ఎవరు అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
