Begin typing your search above and press return to search.

తాను చేసిన చ‌ట్టాన్ని తానే మారుస్తున్న మోడీ రీజ‌నేంటి?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేకంగా భేటీ అవుతోంది.

By:  Garuda Media   |   16 April 2026 12:23 AM IST
తాను చేసిన చ‌ట్టాన్ని తానే మారుస్తున్న మోడీ రీజ‌నేంటి?
X

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ సమావేశాల్లో నారీ శక్తివందన బిల్లును తీసుకురానున్నారు. వాస్తానికి ఇది సవరణ చట్టం. దీనిలో చిత్రం ఏంటంటే.. గతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చేసిన చట్టాలు లేదా బ్రిటీష్ హయంలో చేసిన చట్టాలను సవరించటం తప్పు కాదు. కానీ తాను చేసిన చట్టానికే ప్ర‌ధాని మోడీ ఇప్పుడు సవరణలు తీసుకొస్తున్నారు. ఇది చిత్రమైన విషయం. భారతదేశంలో ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో తాను చేసిన‌ చట్టానికి తనే సవరణలు చేయడం అనేది ఆశ్చర్యకరం.

`నారీ శక్తివంద‌న` అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారికంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన బిల్లు. దీనిని వాస్తవానికి మన్మోహన్ సింగ్ హయాంలోనే పార్లమెంట్లో తీసుకువచ్చారు. కానీ అప్పట్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన స్థానిక పార్టీలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, 2014లో మోడీ హయాంలో ప్రభుత్వం ఏర్పడడంతో ఈ బిల్లు ప‌క్క‌కు పోయింది. ఇక 2023లో రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టిన మోడీ నారీ శక్తివంద‌న పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు.

2023, సెప్టెంబర్ లోనే ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి కూడా దీనికి సంతకం చేశారు. మొత్తంగా ఇది చట్టంగా కూడా మారిపోయింది. అంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలో కానీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారికి 33% వరకు సీట్లను రిజర్వ్ చేసే అంశం చట్టంగా ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయడం ఏమిటి అనేది ప్రశ్న.

అంతేకాదు 2023 అంటే కేవలం రెండున్నర సంవత్సరాల కిందట చేసిన‌ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అనేది మరో ప్రశ్న. ప్రధానంగా గతంలో చేసిన చట్టం ప్రకారం 2034 తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అంటే 2034 ఎన్నికల వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం ఆ చట్టం కల్పించదు. ఇది చేసింది మోడీ ప్రభుత్వమే. ఇదేమి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. మోడీ ప్రభుత్వమే 2023లో ఈ మేరకు చట్టం చేసింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? అనేది కీలకం.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వంపై సహజంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకత ఉందన్నది స్పష్టమవుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళా రిజర్వేషన్లు ముందుకు జరిపి తద్వారా 2029లోనూ లబ్ధి పొందాలి అన్నది రాజకీయంగా బిజెపి ఆలోచన. దీనిని అమలు చేసే క్రమంలోనే ఇప్పుడు మోడీ చేసిన చట్టాన్ని మోడీ ప్రభుత్వం మరోసారి సవరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనినే విపక్షాలు తప్పుపడుతున్నాయి.

2023లో చేసిన బిల్లుకు ఇప్పుడు మళ్లీ సవరణలు దేనికి అని ప్ర‌శ్నిస్తున్నాయి. 2029 నుంచే మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ అమలు చేయడం తప్పు కాదని కానీ గతంలోనే తాము ఈ సూచన చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. దీనికి మోడీ దగ్గర సమాధానం లేదు. అయితే చేస్తున్నది మహిళా రిజర్వేషన్.. అత్యంత సునిసితమైన అంశం కావడంతో విపక్షాలు దీన్ని సమర్థించేందుకు ముందుకు వచ్చాయి.

తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దీనికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఒక ప్రభుత్వం చేసిన చట్టాన్ని అదే ప్రభుత్వం మార్పులు చేయటం అది కూడా కేవలం 2 సంవత్సరాల లోనే సవ‌రించటం అనేది దేశంలో తొలిసారి కావడం విశేషం.